Breaking News

దీపం 2.ఓ పథకం పేద మహిళలకు వరం.. హర్షం వ్యక్తం చేస్తున్న మహిళలు

-మహిళల అభ్యున్నతికి, సాధికారతకు కట్టుబడి ఉన్న కూటమి ప్రభుత్వం: పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పేదల సమస్యలు అర్థం చేసుకున్న మన కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేయాలని నిరంతరం కృషి చేస్తున్నారని దీపం – 2 పథకం అమలు ద్వారా పేద మహిళలకు భరోసా కల్పించేలా సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి  నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

శనివారం  స్థానిక చెన్నా రెడ్డి కాలనీ మునిసిపల్ ప్రైమరీ స్కూల్ ఆవరణ నందు ఏర్పాటు చేసిన దీపం 2 కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించుకోడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కూపంలో నెట్టి వేశారని అన్నారు. ముఖ్యమంత్రి పేద మహిళలు కట్టెల పొయ్యితో వంట చేయడం వలన వారికి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయనే ఉద్దేశ్యంతో వారికి ఉచితంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు దీపం 2 పథకం కింద లబ్ధి చేకూరుస్తున్నారని తెలిపారు. గతంలోనే 2014-19 సం.లో కూడా దీపం పథకం కింద పేద మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించడం జరిగిందని అన్నారు. ఇప్పడు కూటమి ప్రభుత్వం దీపావళి పండుగ కానుకగా దీపం 2. ఓ పథకాన్ని నిన్న ముఖ్యమంత్రి శ్రీకాకుళం జిల్లా నుండి ప్రారంభించారని, ఆ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు ఈ పథకం పట్ల ఎంతో హర్షం వ్యక్తం చేశారని అన్నారు. మన రాష్ట్రంలో కోటి యాభై లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనంత ఎక్కువగా పెంచిన పెన్షన్లు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ కార్యక్రమం కింద అందిస్తున్నామని, ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు సూపర్ సిక్స్ అమలులో భాగంగా అన్నీ ప్రణాళికా బద్ధంగా చేపడుతున్నామని, విపక్షాలు చేస్తున్న ఆరోపణలు తిప్పి కొట్టాలని సూచించారు. యాక్టివ్ గ్యాస్ కనెక్షన్ కలిగి మరియు తెల్ల రేషన్ కార్డు కలిగి ఆధార్ ఉన్న ప్రతి ఒక్క వినియోగదారులు ప్రభుత్వం వారు ప్రకటించిన మూడు ఉచిత సిలిండర్ల పథకానికి అర్హులని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం లో భాగంగా దీపం- 2 పథకంలో ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల ను ప్రభుత్వం పేద ప్రజలకు అందించనున్నదని, ఈ పథకం కింద గ్యాస్ బుక్ చేసుకొనే లబ్ధి దారులకు సిలిండర్ కు వెచ్చించిన సొమ్ము వారి వ్యక్తిగత ఖాతాలకు 24 గం.ల నుండి 48 గంటల్లో జమకానున్నదన్నారు.
ఈ పథకం కింద 2024-25 సంబంధించి మొదటి ఉచిత గ్యాస్ పొందేందుకు మార్చి 31, 2025 వరకు లబ్ధిదారులు నమోదు చేసుకోవచ్చని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. రెండవది వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి జూలై లోపు బుకింగ్ చేసుకోవాలని, మూడవది ఆగస్టు1 నుండి నవంబర్ 31 లోపు పొందాలని, వెరసి మొత్తం సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తోందని అన్నారు. దీపం -2 పథకం పేద మహిళలకు వరంగా అమలు చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారని అన్నారు. మహిళల ఆరోగ్య పరిస్థితిని మార్చేందుకు, మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దీపం పథకాన్ని తీసుకొచ్చాం అని తెలిపారు.

జెసి శుభం బన్సల్ మాట్లాడుతూ నిన్నటి దినాన ముఖ్యమంత్రి  దీపం 2.ఓ పథకం పథకాన్ని పేదలకు అండగా నిలుస్తూ ప్రారంభించారని, సిఎం కి, పౌర సరఫరాల శాఖ మంత్రికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని తెలిపారు. అధికారులు లబ్ధిదారులకు ఈ- కేవైసి ఇబ్బందులు ఉంటే వాటిని త్వరిత గతిన పరిష్కరించి అర్హులైన అందరికీ దీపం 2 పథకం లబ్ది చేకూరేలా చూడాలని సూచించారు.

మునిసిపల్ కమిషనర్ తిరుపతి మాట్లాడుతూ దీపం పథకం పేద మహిళలకు ఒక వరం అని పేర్కొన్నారు. మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 930 పాట్ హోల్స్ గుర్తించి వాటికి మరమ్మత్తులు చేపట్టే కార్యక్రమం నేటి నుండి ప్రారంభం అయిందని అన్నారు.

అనంతరం మంత్రి అధికారులతో కలిసి లబ్ధిదారులకు దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. సదరు వార్డు నందు రోడ్డు పై గుంతలు పూడ్చే కార్యక్రమంలో మంత్రి మునిసిపల్ అధికారులతో జెసి తదితరులతో కలిసి పాల్గొని పట్టణంలో ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్, ఆర్డీఓ తిరుపతి రాంమోహన్, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మాజీ తూడా చైర్మన్ నరసింహ యాదవ్, తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *