మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ జె.నివాస్ పోమవారం కలెక్టరేట్ ఆవరణలో గల ఈవిఎం గొడౌన్ సందర్శించి ఇవిఎంలు భద్రపర్చిన గోడౌన్ల యొక్క లాక్స్, సీళ్లు పరిశీలించారు. గొడౌన్ వద్ద సెక్యూరిటీ చెక్ పరిశీలించారు. సెక్యూరిటీ గార్డుల రూము వర్షాలకు లీకేజ్ అవుతుందని పోలీసు సిబ్బంది. చెప్పగా వెంటనే మరమ్మత్తులు చేయించాలని ఆదేశించారు. కొత్తగా నిర్మించే గొడౌన్ కలెక్టర్ పరిశీలించి , 2 గొడౌన్లను అనుసందానిస్తు వర్షం పడకుండా నిర్మించిన రూఫ్ పరిశీలించారు. రెండు గొడౌన్ల మధ్య రెండవ వైపు ఉన్న దారి గోడ నిర్మించి మూసివేయాలని ఆదేశించారు. గొడౌన్ల వెలుపల అన్ని వైపుల సిసి కెమోరాలు ఏర్పాటు చేయలన్నారు. బందరు ఆర్ డివో ఎస్ఎస్ కె. ఖాజావలి , తహసిల్దారు డి. సునీల్ బాబు, ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంటు శ్యామ్ కలెక్టర్ వెంట ఉన్నారు.
Tags machilipatnam
Check Also
గంగూరు రైతు సేవా కేంద్రం సందర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
పెనమలూరు (గంగూరు), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణాజిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం …