Breaking News

కలెక్టరేట్లో పెండింగ్ ఫైల్స్ అన్ని క్లియర్ చేయాలని ఇక పై పెండింగ్ ఉండరాదు : కలెక్టర్ జె.నివాస్

-సిబ్బంది అందరు సమయపాలన పాటించాలి
-కలెక్టర్ ప్రాధాన్యతలు అర్థం చేసుకుని పని చేయాలి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ జె.నివాస్ సోమవారం కలెక్టరేట్‌లో తమ ఛాంబర్ లో కలెక్టరేట్‌లోని వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహించి వివిధ సెక్షన్లలో పెండింగ్ ఫైల్స్ గురించి సెక్షన్ల వారీగా ఆరా తీశారు. ఆ ఆర్టిఐ సెక్షన్ లో ప్రతి ఒక కేసు క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత ధృవీకరణ అధికారులచే ఆలస్యం కాకుండా నివేదికలు పంపాలన్నారు. ల్యాండ్ ఎలినేషన్ అంశంపై పెండింగ్ ఫైల్స్ జాబితా పెండింగ్ కారణాలతో సహా సమర్పించాలని ఆదేశించారు. భూ సేకరణ సెక్షను సంబంధించిన ఫైల్స్, కోర్టు కేసులు వాటి పరిస్థితి గురించి నివేదిక సమర్పించాలన్నారు. ప్రాజెక్టులకు సంబంధించిన జాబితాను సిద్ధం చేయలన్నారు. కోర్టు తీర్పులు అమలు చేయాల్సిన ఫైల్స్ పెండింగ్ ఉండ కూడదని ఎట్టి పరిస్థితుల్లో కోర్టుదిక్కరణ కేసులు రాకుండా చూడలన్నారు. ఈ విషయాల్లో లీగల్ సెల్ అప్రమత్తంగా ఉండలన్నారు. కారుణ్య నియామకాలకు సంబంధించి ఇప్పటి వరకు పెండింగ్ ధరఖాస్తులు గురించి అడిగి తెలుసుకుని , ధరఖాస్తు దారుల అర్హతలు, ఖాళీల లభ్యతను బట్టి కారుణ్య నియామకాలు ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని ధరఖాస్తు చేసిన నెలలోగా నియామకం జరిగేలా ఖాళీల వివరాలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. ఇప్పటి వరకు కారుణ్య నియామకాల వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కలెక్టర్ ప్రాధాన్యతలు అర్థం చేసుకోని పని చేయాలన్నారు. సిబ్బంది. సమయపాలన పాటించాలని, చెప్పకుండా వస్తానని ఎవరు పనులు వారు చేయాలని, సిబ్బంది అర్హతలు కలిగి ఉండి న్యాయంగా రావాల్సిన పదోన్నతులు ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా ఇవ్వాలని అన్నారు. ఏకేడర్ అయిన పదోన్నతులు పెండింగ్ లో ఉండరాదని, విఆర్వోలకు సీనియర్ అసిస్టెంటు పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులు అమలు చేయలన్నారు.

Check Also

వరద బాధితులకు విరాళాల వెల్లువ

-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *