Breaking News

జగనన్న కాలనీల లే అవుట్లలో మెరక పనులు వేగవంతం చేయాలి… : జెసి మాధవీలత

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జాయింట్ కలెక్టర్ రెవిన్యూ డా. కె. మాధవీలత, జాయింట్ కలెక్టర్ హౌసింగ్ ఎస్.ఎన్. అజయ్ కుమార్ సోమవారం కలెక్టరేట్లో బందరు, గుడివాడ డివిజన్లకు సంబంధించి తహసిల్దార్లు, ఎంపిడివోలు, ఉపాధిహామి మండలాధికారులతో ఇళ్ల స్థలాల లే అవుట్ల అభివృద్ధి, మెరక చేయడం తదితర అంశాలపై సంబంధించి మండలవారీ సమీక్షించారు. 2
జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవీలత మాట్లాడుతూ ఆయా మండలాల్లో మండలవారీ మొత్తం లే అవుట్లు, మెరక చేసిన లే అవుట్లు, గృహనిర్మాణానికి అనువుగా అభివృద్ధి చేసిన లే అవుట్లు, లే అవుట్లకు అప్రోచ్ రోడ్లు, అంతర్గతరోడ్ల అభివృద్ధి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని లే అవుట్లలో గృహనిర్మాణ మెటీరియల్ ఇసుక, కంకర, సిమెంటు, ఇనుము రవాణాకు ఇబ్బంది లేకుండా అప్రోచ్ రోడ్లు వెంటనే నిర్మించాలన్నారు. పెద్ద లే అవుట్లలో అప్రోచ్ రోడ్డుతో పాటు మధ్యలో కారోడ్డు కూడా నిర్మించాలని ఆదేశించారు. మెరక తొలడానికి రోడ్లు వేయడానికి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయునప్పుడు ఇంజనీర్లు కాకి లెక్కలు వేయవద్దని సరిగా అంచనాలు వేయాలని హితవు పలికారు.
అవనిగడ్డ మండలంలో 13 లే అవుట్లకుగాను 10 పూర్తి అయ్యా యని, 2 పెండింగ్ , ఒక లే అవుట్ కోర్టు కేసు వలన అగిందని, పెడన రూరల్ 36 లే అవుట్లకుగాను 32 పూర్తి అయ్యా యని, పెడన అర్బన్లో 4 లే అవుట్లలో 3 పూర్తి కాగా, డంపింగ్ సైట్ కు మెరక చేయుటకు 21 లక్షలతో అంచనాలు రూపొందించినట్లు సంబంధిత అధికారులు జెసికి నివేదించారు. బంటుమిల్లి మండలంలో 19 లే అవుట్లకుగాను 18 పూర్తి, నాగాయలంక మండలంలో 18 లే అవుట్లకుగాను 15 పూర్తి, మొవ్వ మండలంలో 26 లే అవుట్లలో 8 పూర్తి, 10 లే అవుట్లలో గృహనిర్మాణం ప్రారంభించే స్థితిలో ఉన్నట్లు, 8 చోట్ల అప్రోచ్ రోడ్డు సమస్య ఉన్నదని అధికారులు చెప్పగా పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయలన్నారు. చల్లపల్లి మండలంలో 15 లే అవుట్లకుగాను 10 పూర్తి అయ్యా యని అధికారులు తెలిపారు. అదనపు మెరక పనులు చేపట్టవలసిన లే అవుట్లలో అంచనాలు రూపొందించి సంబంధిత అర్ డివోలకు ప్రతిపాదనలు సమర్పించాలని జెసి ఆదేశించారు.
జాయింట్ కలెక్టర్ ఎస్ఎన్. అజయ్ కుమార్ మాట్లాడుతూ గృహనిర్మాణాలకు ఎన్ని లే అవుట్లు అనువుగా ఉన్నచోట్ల గృహనిర్మాణాలు వెంటనే ప్రారంభించేలా లబ్దిదారులలో అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటికి ఎన్ని గృహలు శంఖుస్థాపనలు జరిగాయి. ఎన్ని గృహలు నిర్మాణాలు ప్రారంభించారు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సమావేశంలో బందరు ఆర్ డివో ఎస్ఎస్ కె. ఖాజావలి, గుడివాడ ఆర్ డివో శ్రీనుకుమార్, హౌసింగ్ పిడి కె.
రామచంద్రన్, డ్వామా పిడి జి.వి. సూర్యనారాయణ బందరు, గుడివాడ డివిజన్ల తహసిల్దార్లు, ఎంపిడివోలు, హౌసింగ్ ఎఇలు, డ్వామా ఎపివోలు పాల్గొన్నారు.

Check Also

4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు

-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *