Breaking News

జిల్లాలోని పంచాయతీల్లో టిబి టెస్టులు తప్పనిసరిగ్గా చేయాలి

-జనాభా ప్రాతిపదికన ప్రతి లక్షకు మూడు వేల టిబి టెస్టులు చేయించాలి
-2022 లో టీబీ ముక్త్ పం చాయతీలకు బ్రాన్జ్ మెడల్ కు ఎన్నికైన 109 పంచాయతీలు ఎంపిక.
-2023 లో సిల్వర్ మెడల్ సంపాదించుకున్న 89 పంచాయతీలు
-2024 తో ముగియనున్న సంవత్సరానికి గోల్డ్ మెడల్ కోసం ఇప్పటి వరకూ పోటీలో ఉన్న 39 పంచాయతి లు
-జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా లోని పంచాయతీల్లో టిబి ప్రిసమ్పటివ్ టెస్టులు తప్పని సరిగ్గా చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. శనివారం స్థానిక ఆనం కళా కేంద్రం లో టిబి ఫోరం/సొసైటీ, టీబి ముక్త్ గ్రామ పంచాయతీ అవార్డు ప్రధాన సమావేశంలో ముఖ్య అతిథిగా కలెక్టరు ప్రశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి . ప్రశాంతి మాట్లాడుతూ జిల్లా కు చెందిన 109 పంచాయతీలకు టిబి ముఖ్త్ కింద గాంధీ బ్రాన్జ్ మెడల్ మరియు సర్టిఫికెట్లు అందించడం ద్వారా వారిపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. టిబి లక్షణాలు ఉన్నవారినీ ముందుగా గుర్తించి సరైన చికిత్సలు అందించాలని తెలిపారు.

పంచాయతీలలో టిబి ప్రిసమ్పటివ్ టెస్టులను జనాభా ప్రాతిపదికన చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొనడం జరిగిందనీ, అందులో భాగంగా ప్రతి లక్షకు మూడు వేల టెస్టులు తప్పక చేయించా లని తెలిపారు. టిబి విముక్త్ కార్యక్రమాన్ని సమగ్రమైన విధానంలో చేపట్టాలన్నారు. ఏదైనా ఒక పని చెయ్యడం లో నిబద్ధత కలిగిన ఉండాలనీ పిలుపు ఇచ్చారు. గ్రామ పంచాయతీల పరిపాలన పరమైన విధుల నిర్వహణలో సమాజ ఆరోగ్య సంరక్షణ అత్యంత ప్రాధాన్యత కూడుకున్నదని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. అందులో భాగంగానే నేడు పంచాయతి కార్యదర్శుల బాధ్యత, విధి నిర్వహణలో వారీ పాత్ర పై ఇటువంటి వేదిక ద్వారా అవగాహన కల్పించడం జరుగుతున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో గోల్డెన్ గాంధి అవార్డు కోసం తమ వంతుగా కార్యదర్శులు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి అని పేర్కొన్నారు. స్క్రీనింగ్, పరీక్షలు, నిర్ధారణ, చికిత్స ద్వారా 2025 నాటికి టిబి విముక్తి భారత్ దిశలో ప్రజల్లోకి సమర్ధవంతంగా తీసుకుని వెళ్లాలని సూచించారు. టిబి వలన మన దేశంలో ప్రతి మూడు నిమిషాలకి ఇద్దరు మరణిస్తున్నారని తెలిపారు. టిబి లక్షణాలు ఉన్న వారికి మెరుగైన పోషక విలువలు తో కూడిన ఆహారం అందించడం ద్వారా మాత్రమే సాధ్యం అన్నారు. అందుకోసం మరింత మంది నక్ష మిత్రాలని గుర్తించి వారీ పేర్లు నమోదు చెయ్యాల్సి ఉందన్నారు. వారీ ద్వారా అందచేసే ఆర్థిక సహాయంతో సంపూర్ణ పోషక విలువలు కలిగిన కిట్స్ అందచేసి సంపూర్న ఆరోగ్య వంతులుగా తీర్చి దిద్దేందుకు ముందుకు రావాలని కలెక్టరు కోరారు.

టిబి వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉందని, అయితే సరైన విధానంలో చికిత్సా పొందడం ద్వారా సమూలంగా తొలగించే అవకాశం ఉందనీ జిల్లా లెప్రసీ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర పేర్కొన్నారు. చికిత్సా విధానం, సక్రమంగా మందులు వాడడం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుందని తెలిపారు.

 

 

ఈ సమావేశంలో జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ ఎన్. వసుంధర, డిపిఓ, ఎం. నాగ లత, డి ఈ ఎం ఓ, ఎం ఆర్ పి ఎస్ సత్యకుమార్, డ్రామా పిడి ఏ. నాగమహేశ్వరరావు, ఐఎం ఎ సెక్రటరీ డాక్టర్ గురు ప్రసాద్, ప్రముఖ పలమనాలజిస్టులు డాక్టర్ జి. రత్నాకర్, డాక్టర్ ఏ. మేరీ వసం త, WHO కన్సల్టెం ట్ డాక్టర్. సాయి, టీబీ ఫోరమ్ జిల్లా సభ్యులు డాక్టర్ శర్మ, జిల్లా పంచాయతీరాజ్ ఆఫీసర్, జిల్లాలోని అన్ని పంచాయతీల పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *