Breaking News

అందరు సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తాం

-ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం
-జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ట్ర రెవిన్యూ మరియు స్టాంప్ అండ్ డ్యూటీ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్

పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ ఆంక్షలు అనుగుణంగా జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయ సహకారాలతో ప్రజల అభిమానంతో జిల్లాను అన్ని రంగాలలో ముందుకు నడిపించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్ శాఖలు మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.

సోమవారం కలెక్టరేట్ లోని మీకోసం సమావేశ భవనంలో ఇన్చార్జ్ మంత్రిగా తొలిసారి హాజరై జిల్లా ప్రభుత్వ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాకలెక్టర్ టీ.ఎస్. చేతన్, హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి.కె.పార్థసారథి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సత్యప్రసాద్ యాదవ్, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవితమ్మ, పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్, మడకశిర ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ డిఆర్ఓ విజయ సారథి జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం జరిగింది.
అనంతరం మంత్రి అనగాని సత్య ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఆయా శాఖ అధికారులు కర్తవ్య, నిబద్ధతతో ఉద్యోగ ధర్మాన్ని నెరవేరుస్తూ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దే విధంగా కృషి చేయాలన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు సంతృప్తి స్థాయిలో అందేలా ఆయా శాఖలు పనిచేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే ప్రజలకు చేరువుగా అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలని తపన పడుతున్నారని అన్నారు. అందువల్ల ప్రభుత్వ నిర్ణయాల మేరకు ప్రజలకు సుపరిపాలన అందించాలని మంత్రి సూచించారు.క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేసి ఆయా శాఖల లక్ష్యాలను పూర్తి చేయాలని మంత్రి సూచించారు.
అంతకుముందు మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సత్యసాయి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా సమీక్ష సమావేశాలకు హాజరయ్యే ఆయా శాఖాధికారులు సమగ్ర సమాచార నివేదికలతో హాజరు కావాల్సి ఉంటుందన్నారు.
సంక్షేమం, అభివృద్ధి రెండు సమాంతరంగా వృద్ధి చెందాలని పనిచేస్తున్న విజన్ ఉన్న సీఎం చంద్రబాబు అని కొనియాడారు.

150 రోజుల్లో 150 మంచి పనులు…..
మెగా డీఎస్సీ సుమారు 16,347 ఉద్యోగాలు కల్పిస్తూ సీఎం చంద్రబాబు సంతకం చేశారని అన్నారు. ఒకటో తారీఖున లబ్దిదారుల ఇంటి వద్దకే పెంచిన పింఛన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి అన్నారు. రూ.50 పట్టణ ప్రాంతాల్లోఅన్నాక్యాంటీన్లలోభోజనంపెడుతున్నామని, 150 రోజుల్లో రోజుకు ఒక మంచిపని చేసేలా మంచి పథకాలు అందించారని అన్నారు. గత ప్రభుత్వం లో రాష్ట్రం 15 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. ప్రపంచం మొత్త ఇప్పుడు ఏపీ వైపు చూస్తున్నాయని అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 తో సీఎం ముందుకు వెళ్తున్నారని అన్నారు.ప్రజల కోసం ఉచిత ఇసుక ప్రజలకు ఇసుక భారం కాకూడదని ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చినట్లు మంత్రి అనగాని చెప్పారు. సీనేరేజి కూడా తీసేశారని, ఇసుక అక్రమ రవాణా ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. పక్కాగా సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉండాలని సూచించారు. పేదలు ఇసుకను ఎడ్ల బండి, ట్రాక్టర్లతో వారి స్వంత అవసరాలకు తీసుకెళ్లడానికి ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. యాప్ పొరదర్శకంగా అమలుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వంలో గత నాలుగు నెలల్లో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు అయ్యాయని తెలుపుతూ శ్రీ సత్య సాయి జిల్లాలోఅపారమైన ఖనిజ సంపద నిల్వ ఉన్నదని తెలిపారు. నా నియోజకవర్గ ఎలాగ అభివృద్ధి చేయుచున్నాను అదేవిధంగా శ్రీ సత్య సాయి జిల్లాను అభివృద్ధి చేస్తానని తెలిపారు, జిల్లాలో పెండింగ్ ఉన్న బిల్లులన్నీ సుమారు 97 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని పోయి వాటిని చెల్లించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి మన అందరం కలిసికట్టుగా పని చేయాలని తెలిపారు. అనంతరం రాష్ట్ర వైద్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ చాలామంది అధికారులు మీ మీ శాఖలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, త్వరలో జరిగే సమావేశాలలో మీ మీ శాఖలలో మంచి పట్టు సాధించాలని పేర్కొన్నారు. అజెండలో ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన అంశాలను సమగ్రంగా పరిశీలించి వాటిని పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని తెలిపారు అధికారులందరూ క్షేత్రస్థాయిలో తిరిగి సంబంధించిన అంశాలపై ప్రగతిని సాధించాలని పేర్కొన్నారు జిల్లాలో వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి త్వరితగతిన చర్యలు చేపట్టడం జరుగుతుందని అందరం కలిసికట్టుగా పని చేసి జిల్లాని ముందు వరుసలో ఉండే విధంగా కృషి చేద్దామని పేర్కొన్నారు
పార్లమెంట్ సభ్యులు బి.కె. పార్థసారథి మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు అన్ని శాఖలలో పెండింగ్ లో ఉన్న వివరాలు తెలపాలని పలు శాఖ అధికారులను కోరారు. అలాగే జిల్లాలో గత ఐదు సంవత్సరకాలంలో జరిగిన పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులు ఉన్నందున వాటిని చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇంచార్జ్ మంత్రిని కోరారు. జిల్లాలో బిందు సేద్యం ద్వారా రైతులకు నాణ్యమైన వస్తువులనుఅందజేయాలని తెలిపారు

మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ మడకశిర నియోజకవర్గం జిల్లాలో చాలా వెనుకబడిన ప్రాంతమని ప్రస్తుతం వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉన్నందున వాటిని సత్వరమే భర్తీ చేయుటకు చర్యలు తీసుకోవాలని ఇన్చార్జి మంత్రిని కోరారు. అలాగే విద్యుత్ శాఖకు సంబంధించి తన నియోజకవర్గంలో లో వోల్టేజి సమస్య ఉందని గత నాలుగు సంవత్సర కాలంగా రైతులు ట్రాన్స్ఫార్మర్ల కొరకు డబ్బులు చెల్లించినప్పటికీ ఇప్పటికీ సరఫరా కాలేదని ఈ అంశంలో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని పరిష్కరించాలని తెలిపారు.
పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర రెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గంలో హౌసింగ్ టిడ్కో కు సంబంధించిన సమస్యలున్న కారణంగా వాటి పరిష్కారానికి సంబంధిత శాఖ అధికారులు కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ఆర్డీవోలు సువర్ణ, మహేష్, రమేష్, ఆనందబాబు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *