Breaking News

స్వర్ణాంద్ర సాధనలో కేంద్ర ప్రాయోజిత పథకాలు అనుసంధానం

-20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్పెర్సన్ లంకా దినకర్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్వర్ణాంద్ర సాధనలో కేంద్ర ప్రాయోజిక పథకాలను అనుసంధానం చేస్తూ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు తన వంతు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్పెర్సన్ లంకా దినకర్ తెలిపారు. కేంద్ర ప్రాయోజిత పథకాలైన జల్ జీవన్ మిషన్, ఉపాధి హామీ, పీఎం ఆవాస్ యోజన, జాతీయ ఆహార భద్రత, నేషనల్ గోకుల్ మిషన్ వంటి పలు పథకాలను పెద్ద ఎత్తున రాష్ట్రంలో అమలు పర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్పెర్సన్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే నీతిఆయోగ్ 17 స్థిరమైన అభివృద్ది లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర @2047 విజన్ లక్ష్యాల సాధన దిశగా 20 సూత్రాల కార్యక్రమం అమలుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. అందుకు అనుగుణంగా సమగ్ర నివేదిక ను రూపొందించి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు సమర్పించడమైందన్నారు. ఈ నేపధ్యంలో స్వర్ణాంద్ర సాధనకు 12 సూత్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ మధ్యనే ప్రకటించడం జరిగిందన్నారు. ఈ లక్ష్య సాధన దిశగా స్వర్ణాంద్ర సాదనకై కేంద్ర ప్రాయోజిత పథకాలను పెద్ద ఎత్తున వినియోగించుకునేలా సంబంధిత శాఖల వారీగా సమీక్షలు నిర్వహించడం జరుగుచున్నదన్నారు. జల్ జీవన్ మిషన్, ఉపాధి హామీ, పీఎం ఆవాస్ యోజన, జాతీయ ఆహార భద్రత, నేషనల్ గోకుల్ మిషన్, ప్రజా ఆరోగ్యం, మహిళ మరియు శిశు సంక్షేమం, పేదరిక నిర్మూలనకు సంబందించిన శాఖల అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. జాతీయ గోకుల్ మిషన్ పథకాల ద్వార పాల ఉత్పత్తిన్ని పెంచడానికి, మేలురకం జాతుల పశు సంపద పెంచడానికి కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు. ఆర్ధిక, సామాజిక మరియు నాగరికత అభివృద్ధిలో నీటి ప్రాముఖ్యత అత్యంత ఆవశ్యకత ఉన్న నేపధ్యంలో పోలవరం, వెలుగొండ ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసే అంశంపై కూడా క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తూ అధికారులను అప్రమత్తం చేయడం జరుగుచున్నదన్నారు. 2019 – 24 మధ్య కాలంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పోలవరంతో సహా ఏ ప్రాజెక్టు అడుగు ముందుకు పడలేదని, ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ అధ్వానంగా మార్చారన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే గత ప్రభుత్వం జాతికి అంకితం చేసిందన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కేంద్రం సహాయంతో 45.72 మీటర్ల ఎత్తుతో 194 టీఎంసీల పూర్తి సామర్ధ్యంతో, 175 టీఎంసీల ఉపయోగిత సామర్ధ్యం కలిగిన పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టు నిర్మాణం మొదటి దశ పూర్తి కావడానికి రూ.12,157 కోట్లు విడుదలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందని, ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్రం ఇప్పటి వరకూ రూ.15,146 కోట్లు విడుదల చేసిందన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడిన అనంతరం ఒకవైపు కేంద్రం నుంచి నీటి ప్రాజెక్టుల నిధులు రాబడుతూనే రాష్ట్ర పరిధిలోని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరం క్షేత్రస్థాయిలో సమీక్షలు చేస్తూ వాస్తవ అవసరాల ఆధారంగా ఆయా ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్పెర్సన్ హోదాలో వెలిగొండ పర్యటన మరియు సమీక్షలో భాగస్వామ్యం కావడం జరిగిందని, క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని నివేదిక రూపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, సంబందిత మంత్రుల బృందానికి సమర్పించడం జరిగిందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *