గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ హౌసింగ్ లే అవుట్స్ ల్లో ఇళ్ళ నిర్మాణ పనుల కాంట్రాక్టు పొందిన కాంట్రాక్టర్లు పనులు వేగవంతం చేసి, డిసంబర్ నెలలో తమ నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ఇళ్లు పూర్తి చేసి లబ్దిదారులు గృహ ప్రవేశాలు చేసేలా హౌసింగ్, నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులు ప్రతి రోజు పర్యవేక్షణ చేయాలని నగరపాలక సంస్థ కమీషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు ఆదేశించారు. మంగళవారం గుంటూరు నగరపాలక సంస్థ లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించిన పేరేచర్ల లే అవుట్ లో హౌసింగ్ పిడి, ఇంజినీరింగ్, హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు, ఎమినిటి కార్యదర్శులు, కాంట్రాక్టర్లతో లే అవుట్ లో ఇళ్ళ నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత లే అవుట్ లో కాంట్రాక్టర్ల వారీగా ఇళ్ళ నిర్మాణం ఏ మేరకు పూర్తి అయింది, గ్రౌండ్ లెవల్ ఎన్ని ఉన్నది, మౌలిక వసతులు, బిల్స్ చెల్లింపు, ఇసుక, సిమెంట్, ఇనుము లభ్యత తదితర అంశాలను అధికారులను, కాంట్రాక్టర్లను అడిగి తెల్సుకొని, మాట్లాడుతూ డిశంబర్ నెలలో లబ్దిదారులు గృహ ప్రవేశాలు చేసేలా హౌసింగ్ లే అవుట్స్ ల్లో ఇళ్ల నిర్మాణపనులు కాంట్రాక్టర్ల వారీగా ఇచ్చిన టైం లైన్ మేరకు చేపట్టాలని, నిర్మాణ పనుల కాంట్రాక్ట్ పొందిన కాంట్రాక్టర్లు అవసరమైన కార్మికులను సిద్దం చేసుకోవాలన్నారు. ప్రతి లే అవుట్ నుండి కాంట్రాక్టర్ ప్రతి రోజు నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా పనులు చేయాలని, నోడల్ అధికారులు కూడా పర్యవేక్షణ చేయాలన్నారు. లే అవుట్ ల వారిగా ఎప్పటికప్పుడు పనుల పురోగతి పై నివేదిక ఇవ్వాలని, ఏ సమస్య ఎదురైనా అధికారులు సమన్వయంతో పరిష్కరించి పనుల వేగవంతంకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టేజిల వారీగా నిర్మాణ పనులు పూర్తి అయిన వాటికి సంబందించి బిల్లుల ఆన్ లైన్ ఎమినిటి కార్యదర్శులు, హౌసింగ్ అధికారులు సమన్వయంతో ఎప్పటికప్పుడు చేయాలని, జాప్యం చేయవద్దని స్పష్టం చేశారు. లబ్దిదారుల జియోట్యాగ్ ని సచివాలయాల వారీగా లిస్టు తీసుకొని నోడల్ అధికారులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కాంట్రాక్టర్లు
సమావేశంలో హౌసింగ్ పిడి ప్రసాద్, ఈఈ శంకరరావు, నగరపాలక సంస్థ ఈఈ సుందర్రామిరెడ్డి, నగరపాలక సంస్థ, హౌసింగ్ డిఈఈలు, ఏఈలు, నోడల్ అధికారులు, మైనింగ్ అధికారులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్
-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …