Breaking News

ఆర్ & బీ కాంట్రాక్ట్ బిడ్ లకు అర్హత కాల పరిమితి 5 నుంచి 10 ఏళ్లకు పెంచుతూ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి నిర్ణయం

-మంత్రి నిర్ణయంతో చిన్న, మధ్య తరగతి ఆర్ & బీ కాంట్రాక్టర్లకు ఊరట

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో కాంట్రాక్టర్లు అందరికీ మేలు చేసే విధంగా 5 ఏళ్ల బ్లాక్ పీరియడ్ కాల పరిమితిని 10 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.. గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో కాంట్రాక్టర్లు పెద్దగా అభివృద్ధి పనులు చేపట్టిన దాఖలా లేదు.. దీనికి ప్రధాన కారణం.. 3 ఏళ్ల పాటు కరోనా కారణంగా అభివృద్ధి పనులు జరగకపోవడం ఒకటైతే, మరోవైపు గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి ఊసే లేని పక్షంలో, ఆయా కాంట్రాక్టర్లకు పనులు చేసే అవకాశం రాలేదు.. ఒకవేళ అభివృద్ధి పనులు చేపట్టినా, బిల్లులు రాకపోవడం, లేదంటే అవి సకాలంలో పూర్తికాకపోవడం వంటి సమస్యలతో నేడు వారంతా ఆర్ & బీ కాంట్రాక్టర్లుగా బిడ్ వేసేందుకు అర్హత కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీంతో నేడు రాష్ట్రంలోని మెజార్టీ కాంట్రాక్టర్లు ఆయా కాంట్రాక్ట్ పనులు చేపట్టడానికి తగిన అర్హత లేకుండా పోయింది.. ముఖ్యంగా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఆర్ & బీ శాఖలో జరగబోయే రోడ్ల అభివృద్ధి & మరమ్మతులు వంటి పనులు చేపట్టేందుకు, గతంలో 5 ఏళ్ల కాల పరిమితిలో ఆయా కాంట్రాక్టర్లు చేపట్టిన పనులు, టర్నోవర్ వంటివి ప్రాతిపదికగా తీసుకుంటే మెజార్టీ కాంట్రాక్టర్లు నేడు నష్టపోయే పరిస్థితి ఉంది.. ముఖ్యంగా 5 సంవత్సరాల కాల పరిమితిని అర్హత గా తీసుకోవడం వల్ల మెజార్టీ కాంట్రాక్టర్ లు, సామర్థ్యం ఉన్నా, అర్హత లేక ఆయా కాంట్రాక్ట్ పనులు చేపట్టే అవకాశం కోల్పోతారు.. ఈ నేపథ్యంలో చిన్న, మధ్య తరగతి కాంట్రాక్టర్ల నుంచి వచ్చిన వినతుల మేరకు ఆర్ & బీ శాఖ తరపున కాంట్రాక్టర్ల అందరి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బ్లాక్ పీరియడ్ ను 5 నుంచి 10 ఏళ్లకు పెంచాలనే సానుకూల నిర్ణయం మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తీసుకోవడం జరిగింది.. దీంతో రాష్ట్రంలోని మెజార్టీ కాంట్రాక్టర్లకు ఆర్ & బీ పనుల టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించేందుకు వీలుపడుతోంది..

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *