– ఇప్పటివరకు 3,59,462 మందికి గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు డెలివరి చేయడం జరిగింది.
– మొదటి ఉచిత సిలిండరు పొందుటకు 2025 మార్చి 31 వ తేది లోపు బుకింగ్ చేసుకొనే అవకాశం ఉంది.
– గ్యాస్ సిలిండర్ డెలివరి పొందిన 48 గంటలలో సొమ్ము బ్యాంకు ఖాతాకు జమ చేయడం జరుగుతుంది.
-ఆధార్ నెంబరుతో అనుసంధానమైన గ్యాస్ కనెక్షన్ కార్డు EKYC నమోదు చేసుకోవాలి
-జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్న రాముడు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సూపర్ సిక్స్ వాగ్దానాలలో ప్రతిష్టాత్మకముగా అమలుపరిచిన ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలెండర్లు ఉచితంగా పొందు దీపం-2 పథకం ద్వారా తూర్పుగోదావరి జిల్లాలో గల 43 గ్యాస్ ఏజేన్సీల ద్వారా ఇప్పటివరుకు గ్యాస్ సిలిండరు పొందుటకు 4,02,331 బుకింగ్స్ కాగా వాటిలో 3,59,462 మందికి గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు డెలివరి చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి ఉచిత సిలిండరు పొందుటకు 2025 మార్చి 31 వ తేది లోపు బుకింగ్ చేసుకుని గ్యాస్ సిలందరు డెలివరి పొందుటకు సమయం ఉన్నదన్నారు. లబ్దిదారులు ఎవ్వరూ కూడా ఏవిధమైన ఆందోళనకు గురి కానవసరం లేదని, లబ్దిదారులు అందరూ ఆధార్ నెంబరుతో అనుసంధానమైన గ్యాస్ కనెక్షన్ కార్డుకు వారి యొక్క EKYC నమోదు మరియు బ్యాంకు అక్కౌంట్ లింకు చేసుకోవాలనారు. గ్యాస్ సిలిండర్ డెలివరి పొందిన తదుపరి లబ్దిదారుకు 48 గంటల తర్వాత పనిదినాలలో ప్రభుత్వం నుండి సొమ్ము బ్యాంకు ఖాతాకు నేరుగా జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ వంట గ్యాస్ సిలిండర్లు పూర్తిగా గృహవినియోగాలు కోసం మాత్రమే వినియోగించాలని జాయింట్ కలెక్టరు. చిన్న రాముడు తెలిపారు. తెలుపు రంగు రేషన్ కార్డుదారులు అందరూ దీపం 2 పథకమునకు అర్హులన్నారు. EKYC చేయించని వినియోగదారులు ఎవరైనా ఉంటే తమ దగ్గరకు వచ్చు గ్యాస్ డెలివరీ బాయ్ దగ్గర ఉండే మొబైల్ ద్వారా EKYC చేయించుకోవచ్చునన్నారు. LPG కనెక్షన్ కు తప్పనిసరిగా EKYC ఉండాలని తెలిపారు. ఈ పధకం అమలులో ఎప్పటికప్పుడు జిల్లా పౌరసరఫరాల సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేస్తూ ఉండాలని అధికారులుకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. మరిన్ని వివరాలు కొరకు సందేహాలు నివృత్తి కొరకు టోల్ ఫ్రీ నెంబర్ : 1967కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చునని జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు ఆ ప్రకటనలో తెలిపారు.