Breaking News

నేడు ప్రపంచ కాన్సర్ డే అవగాహన ర్యాలీలో సంయుక్తంగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ మరియు తిరుపతి ఎంఎల్ఏ

-అవగాహన ద్వారా క్యాన్సర్ వ్యాధిని అరికట్టవచ్చు: జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్
-క్యాన్సర్ వ్యాధి నివారణ దిశగా ప్రజలకు అవగాహన కల్పించాలి : తిరుపతి శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నేడు ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్ వ్యాది పట్ల ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోని, ముందు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా క్యాన్సర్ వ్యాధి నివారించవచ్చని జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఉదయం స్విమ్స్ ఆసుపత్రి ఎంట్రన్స్ వాల్మీకి విగ్రహం వద్ద క్యాన్సర్ అవగాహన ర్యాలీ లో జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, తిరుపతి ఎంఎల్ఏ ఆరణి శ్రీనివాసులు , ఎన్.యు.హెచ్.ఎం స్టేట్ నోడల్ ఆఫీసర్ డా. జె.విజయలక్ష్మి డీఎంఎచ్ ఓ డా. శ్రీహరి లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రస్తుత రోజుల్లో నమోదవుతున్న మరణాలలో క్యాన్సర్ బారిన పడి 5 వ వంతు మరణాలు క్యాన్సర్ ద్వారా సంభవిస్తున్నాయని, వీటిలో వివిధ రకాల క్యాన్సర్ వ్యాదులతో మరణిస్తుస్తున్నారని, ముఖ్యంగా రొమ్ము, నోటి, సర్వైకల్ క్యాన్సర్ లను ముందుగా స్క్రీనింగ్ చేసి అరికట్టవచ్చని తెలిపారు. , కొంతమంది క్యాన్సర్ కారక లక్షణాలు ఉన్నప్పటికీ అవగాహన లేక సరైన సమయానికి చికిత్స అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. కావున ప్రతి ఒక్కరు క్యాన్సర్ వ్యాధి మరియు నివారణ మార్గాల పై అవగాహన పెంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. వైద్య సిబ్బంది అందరూ ఇంటింటికి వెళ్లి పై తెలిపిన మూడు రకాల క్యాన్సర్లకు సంబంధించి స్క్రీనింగ్ తో పాటు బి.పి మరియు డయాబెటిస్ లను కూడా స్క్రీనింగ్ చేయాలని తెలిపారు. బ్రెస్ట్ క్యాన్సర్,సర్వైకల్ క్యాన్సర్ అనేది 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిలో ఎక్కువగా కనిపిస్తోందని ఈ లక్షణాలు కల వారిని ముందుగానే స్క్రీనింగ్ లో గుర్తించి దగ్గరలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రి, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కి తీసుకెళ్లి ముందుగా చికిత్స అందించాలని అందుకు సంబంధించిన రేడియోథెరపీ గానీ, కీమోథెరపీ గానీ చేయించాలని అన్నారు. ఈ చికిత్సలను ప్రభుత్వం ఉచితంగా రుయా, స్విమ్స్ ఆసుపత్రులో అందుబాటులో ఉంచిందని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉండాలని ఉద్దేశంతో ఈ రోజున క్యాన్సర్ కు సంబంధించిన అవగాహన ర్యాలీనీ తిరుపతి పట్టణం లో నిర్వహించడం జరిగిందని అన్నారు. తిరుపతి శాసన సభ్యులు మాట్లాడుతూ … ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోందని అన్నారు. ఈ క్యాన్సర్ నివారణ చర్యలో భాగంగా ప్రజలలో అవగాహన కల్పించడం కోసం ఏఎన్ఎంలు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించి క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉన్న వారిని గుర్తించి చికిత్స అందించాలని తెలిపారు. క్యాన్సర్ వ్యాధిని మొదటి దశలోనే గుర్తించి నివారణ దిశగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎం.ఎల్.ఏ సుగుణమ్మ, రుయా, సిమ్స్ ఆస్పత్రుల సుపరిండెంట్లు డా. రవి ప్రభు, డా. రామ్, ఆర్ ఎం ఓ డా. కోటిరెడ్డి, మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డా. చంద్రశేఖర్, స్విమ్స్ క్యానర్ విభాగ నోడల్ ఆఫీసర్ డా.నాగరాజు, అసిస్టెంట్ డైరెక్టర్ (PRO ) రాజశేఖర్, ఒమేగా, టాటా క్యాన్సర్ హాస్పిటల్ వైద్యసిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *