తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
75వ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ను భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా అధికారులు కలసి స్టికర్, మెమెంటోను అందజేసి, శుభాకాంక్షలు అందజేశారు. అనంతరం స్కౌట్స్ అవతరణ దినోత్సవ చరిత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమీషనర్లు ఎం. ఎం. రెడ్డి, టి. రమేష్ బాబు, జిల్లా కార్యదర్శి ఎం. జయరాం, రాష్ట్ర సహాయ కార్య నిర్వాహక కమీషనర్ కోటేశ్వరరావు, జిల్లా ట్రైనింగ్ కమీషనర్ జి. వెంకటేశ్వర్లు, బాలిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News