తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
భారత్ స్కౌట్స్ మరియు గైడ్స్, 75 వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతి జిల్లాలో మంగళం లో వున్నా జిల్లాలో పరిషత్ ఉన్నత పాఠశాల జరిగిన కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి కేవీక్ కుమార్ మాట్లాడుతూ ప్రతీ పాఠశాలలో స్కోట్, గైడ్ యూనిట్స్ విధిగా ఏర్పాటుకు కృషి జరుగుతుందని 2024-25వార్షిక సం. ము నకు గాను జిల్లాలో 1500 పాఠశాల లలో స్కౌట్ శాఖలు ఏర్పాటుకు తగు చర్యలు తీసుకుంటున్నామని. ఇందులో ప్రధాన మంత్రి క్రింద తిరుపతి జిల్లాలో 40 పాఠశాలలకు 50 వేల చొప్పున సమగ్ర శిక్ష ద్వారా ఇవ్వడమే కాకుండా, వారికీ ప్రత్యేక క్రమంగా కార్యాచరణ, శిక్షణలు జరుగుతాయాని, మన జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో 2023-24కు గాను 568 యూనిట్స్ తో ప్రప్రథమ స్థానాన్ని పొందిందనీ దానిని అలాగే నిలుపు కొనుటకు కార్యర్గం కృషి చేయాలన్నారు. అందుకు జిల్లా యంత్రంగం, విద్యాశాఖ పూర్తి సహాయ సహకారములు అందిస్తుందని తెలిపారు. స్వచ్ఛ భారత్ తో బాటు, క్రమం శిక్షణ, పరిసరాల పరిశుభ్రత, మొక్కలు నాటి పెంచుచూ, వాటి సంరక్షణ, ప్లాస్టిక్ వాడకం తగ్గించుట పై విద్యార్థులు స్కౌట్, గైడ్స్ గా చేరి ప్రతీ విషయం పై అవగాహన పెంచుకొని, పాఠశాల మరియు వ్యక్తిగత అభివృద్ధికి కృషి చేయాలన్నారు. తిరుపతి జిల్లా ఉప విద్యాధికారి బాలాజీ తెలియ జేశారు… ఈ కార్యక్రమానికి జిల్లా వయోజన వనరుల కమిషనర్ . ఎం. ఎం రెడ్డి అధ్యక్షత వహించగా,
జిల్లా కార్యదర్శి జయరాం. వార్షిక నివేదిక సమర్పించి, ఫ్లాగ్ డే స్టిక్కర్స్ ను విడుదల చేశారు. నిర్వాహక కమిషనర్ కోటేశ్వర రావు స్కార్ఫ్ అధికారులను సత్కరించారు.జిల్లా కార్యాలయ కమిషనర్ రమేష్ బాబు, శిక్షణా కమిషనర్ వెంకటేష్ లు కూడా స్కౌట్ కార్యక్రమలపై అవగాహన కల్పిస్తూ, ప్రభుత్య శాఖలలో ఇస్తున్న కోట పై అవగాహనను ఇచ్చారు మరియు మాస్టర్స్ అడ్వాన్స్ కోర్స్ చేసిన వారికీ గుర్తింపు పత్రములు ఇవ్వడము జరిగింది ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు, స్కౌట్ మాస్టర్స్, మునిరత్నం, వెంకటేశు, రామకృష్ణ, వేంకటాద్రి, మురళి, హేమకుమార్, గైడ్ కెప్టెన్లు పాల్గొన్నారు.
Tags tirupati
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …