తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో జరుగుతున్న ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరీకరణ గురించి సహకార సంఘాల కమీషనర్ మరియు రిజిస్ట్రార్ ఎ.బాబు I.A.S , రాష్ట్రంలోని అన్ని జిల్లాల జాయింట్ కల్లెక్టర్లతో ఈరోజు సమీక్షా సమావేశం వర్చువల్ విధానంలో నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో జెసి శుభం భన్సల్ తిరుపతి మాట్లాడుతూ జిల్లాలోని 58 పి.ఎ.సి.ఎస్.లలో రికార్డులు కంప్యూటరీకరణ పనులు జరుగుతున్నాయని, సదరు ప్రక్రియలో భాగంగా సంఘ సభ్యుల KYC వివరాలు, లోన్లు, డిపాజిట్లు మరియు ఇతర వివరాలు ఆన్లైన్ లో నమోదు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ నెల 30వ తేది లోపల అన్ని సంఘాల కంప్యూటరీకరణను పూర్తి చేయమని కమీషనర్ వారు ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా సహకార అధికారిణి .ఎస్.లక్ష్మి మరియు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, చిత్తూరు మరియు నెల్లూరు జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Tags tirupati
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …