తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు లోబడి అవిలాల చెరువు అభివృద్ధి కొరకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి వారు రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపు రెడ్డి మౌర్య, జెసి శుభం బన్సల్, టీటీడీ సిఈ సత్యనారాయణ తదితర అధికారులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించి సమీక్షిస్తూ అవిలాల చెరువును ఎన్జిటి నిబంధనలకు లోబడి అభివృద్ధి చేయుట కొరకు ఒక కమిటీని టీటీడీ సిఈ, ఇరిగేషన్ ఈఈ, పిడి ఎన్హెచ్, ఆర్డీఓ తిరుపతి, తుడా సెక్రెటరీ లతో ఏర్పాటు చేసి రెండు వారాల్లో నివేదికను సమర్పించాలని సూచించారు. ఈ సమావేశంలో తుడా సెక్రెటరీ డా. వెంకట నారాయణ, టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ గుణ భూషణ్ రెడ్డి, ఆర్డీఓ తిరుపతి రామ్మోహన్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథరామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News