Breaking News

వార్డు సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ, ప్రభుత్వ పథకాల వివరాల బోర్డులను ప్రదర్శించాలి…

-సచివాలయం ద్వారా అందిస్తున్న సేవలు నిర్ణీత సమయంలోనే పరిష్కరించాలి..
-కోవిడ్ కట్టడికి “నో మాస్క్ నో ఎంట్రీ , “నో మాస్క్ – నో రైడ్”, “నో మాస్క్ – నో సేల్ ” నినాదాలతో ప్రత్యేక అవగాహన కల్పించాలి…
-మున్సిపల్ కమీషనర్ పీజే సంపత్ కుమార్

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సచివాలయాలు ద్వారా ప్రజలకు అందిస్తున్నసేవలకు సంబందించి ఏ ఒక్క అంశం పెండింగ్ లో లేకుండా నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలని, విధులు పట్ల నిర్లక్ష్యం వహించే సిబ్బంది చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ కమీషనర్ పీజే సంపత్ కుమార్ అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం వార్డు సచివాలయాల సచివాలయ పాలనాధికారులతో ప్రభుత్వ పథకాలు అమలు పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడివాడ పురపాలక సంఘ పరిదిలో గల 34 వార్డు సచివాలయాల్లో ప్రభుత్వ సర్వీసులకు సంబందించి ఏ ఒక్కటీ పెండింగ్ లో లేకుండా నిర్ణీత కాల వ్యవధిలోనే పరిష్కరించాలన్నారు. జిల్లా కలెక్టరు ప్రతి నెల వారంలో రెండు రోజులు సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేస్తున్నారన్నారు. సచివాలయ పరిపాలన కార్యదర్శులు, వివిధ శాఖల పర్సన్ అసిస్టెంట్లు మీ శాఖలకు సంబందించి ఏ ఒక్కటీ పెండింగ్ లో లేకుండా పరిష్కరించాలన్నారు. నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించకుండా పెండింగ్ లో ఉన్నట్లయితే అటువంటి వారిపై పెనాల్టీ విధించి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రతి వార్డు సచివాలయంలో ప్రభుత్వ పథకాలు, వాటి అర్హతలు, సచివాలయం ద్వారా అందించే సేవలు, లబ్దిదారుల వివరాలతో కూడిన బోర్డులు ప్రజలకు తెలిజేసే విధంగా ప్రదర్శించాలన్నారు. ఇందులో ఎటువంటి అలసత్వం వహించినా ఆయా గ్రామ కార్యదర్శులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ భాద్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు. ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు సమయంలో ఇబందులకు గురికాకుండా అటిండెన్స్, మూమెంట్ రిజిస్టర్లలను నిర్వహించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలు మేరకు గుడివాడ పట్టణంలో ఇంటింటికీ కొలతలు టౌన్ ప్లానింగ్ అధికారులు చేపట్టారన్నారు. పట్టణంలోని గృహ యజమానులు వారు కొలతలు తీసుకొనే సమయంలో సహకరించి వారు అడిగిన సమాచారాన్ని అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పట్టణాన్ని కాలుష్య రహిత పట్టణంగా తీర్చి దిద్దేందుకు ప్రతి ఇంటికీ గ్రీన్, బ్లూ, రెడ్ కలర్ గల మూడు బుట్టలను చెత్తను నిల్వచేసుకొనేందుకు అందిస్తున్నామని తదుపరి ఆ చెత్తను డంపింగ్ యార్డుకు తరలించడం జరుగుతుందన్నారు. చెత్త సేకరణలో భాగంగా ప్రతి ఇంటికీ నెలకు 90 రూపాయలు చొప్పున సేకరించడం జరుగుతుందని, స్లమ్ ఏరియాల్లో నెలకు 30 రూపాయలు చొప్పున సేకరిస్తూ కార్యక్రమాన్ని ఆయా సచివాలయ శానిటరీ సెక్రటరీలు పర్యవేక్షణలో నిర్వహిస్తారన్నారు. ఆటోల ద్వారా చెత్త సేకరణకు టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే పట్టణంలోని 9,18 వార్డుల్లో నిర్వహిస్తున్నట్లు కమీషనర్ సంపత్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టరు ఆదేశాలు మేరకు కోవిడ్ నియంత్రణలో భాగంగా సెప్టెంబర్ నెలఖారు వరకు ప్రతి వారంలో మూడు రోజుల పాటు “నో మాస్క్ నో ఎంట్రీ”, “నో మాస్క్ – నో రైడ్”, “నో మాస్క్ – నో సేల్ ” నినాదాలతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. ఇందుకు సంబందించి ప్రతి సోమవారం నో మాస్క్ నో ఎంట్రీ నినాదంతో నిర్వహించే ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లోకి ప్రార్థన మందిరాల్లోకి, బ్యాంకులు, ఫోస్టుఆఫీసులు, మాల్స్, పబ్లిక్ పార్కులు, పరిశ్రమలు, వాణిజ్య ప్రాంతాలు, రెస్టారెంట్లులోకి మాస్కులులేకుండా అనుమతించకూడదని ఈ అంశంపై ప్రత్యేక అవగాహన కల్పించేందుకు బ్యానర్లు, వాల్పోస్టర్లు, మైక్ ద్వారా ప్రచారం నిర్వహించడంతోపాటు మాస్కులు పంపిణీ చేయాలన్నారు. ప్రతి మంగళవారం నో మాస్క్- నో రైడ్ నినాదంతో వాహన చోదకులు, ప్రయాణికులు, తప్పనిసరిగా మాస్కులను ధరించడంపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ప్రతి బుధవారం నో మాస్క్ నో సేల్ అన్న నినాదంతో మాస్కులు ధరించని కొనుగోలు దారులకు దుకాణదారులు, సరుకులు, వస్తువులను విక్రయించకూడదన్నా ప్రచారాన్ని ముమ్మరం చేసే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా బ్యానర్లు, ప్లేకార్డులు, ప్రదర్శించడం, కర్రపత్రాలు, స్టికర్లు, వాల్ పోస్టర్లు పంపిణీ చేయడం విషయాలపై సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగిందని కమీషనర్ సంపత్ కుమార్ అన్నారు. సమావేశంలో వార్డు సచివాలయ కార్యదర్శులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *