నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాన నగరం తిమ్ఫు నుండి దాదాపు 24 గంటల ప్రయాణంతో పారోలోని చుంఫు నైలో ఉన్న తేలియాడే విగ్రహ ఆలయం. ఈ ఆలయం కొండ పైభాగంలో ఉంది – వేద అభ్యాసానికి నిజమైన ఆలయం…
వారాహి అమ్మవారి దేవాలయం, భూటాన్
మన హైందవంలో శక్తిని ఆరాధించేవారు, శైవులు (శివుడిని ఆరాధించేవారు),
వైష్టవులు (విష్ణువును ఆరాధించేవారు) అందరు కూడా వారాహి అమ్మవారిని ఆరాధించేవారట.
వారాహి దేవతను ఎక్కువగా వామమార్గ తాంత్రిక సాధన చేసే వారు ఆరాధిస్తారట..
అందుకే మన జనబాహుళ్యానికి ఎక్కువగా తెలియదు.
గాలిలో తేలియాడుతున్నట్లుగా ఉండే అమ్మవారు భూటాను లోని Chumphu nye in Paro అనే ప్రాంతంలో (భూటాన్ లోని ఒక ముఖ్య పట్టణం ‘థింపు ’ నుండి ఒక రోజు ప్రయాణం…) అమ్మ వారు ఒక పర్వత శిఖరాగ్రమున కొలువై ఉన్నారు.. ఇక్కడి విగ్రహం భూమిపై ఆధారంగా నిలబడి ఉండదు.
అమ్మవారి విగ్రహం క్రింది భాగం గుండా పేపర్ ను చాలా సులభంగా ఇటునుండి అటుకు తీసుకు వెళ్ళి ఆ విగ్రహం గాలిలో నిలబడి ఉన్నట్లుగా మనకు అక్కడి పూజారులు చూపిస్తారు… చాలా అద్భుతంగా ఉంటుందట… ఈ గుడిలోని అమ్మవారి విగ్రహాన్ని ఫోటోలు తీయడానికి అనుమతించరు.. అందుకే ఎక్కడా ఈ చిత్రాలు మనకు కనపడవు… ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిత్రం కొంతమంది భక్తులతో వేయ బడిన పెయింటింగ్.