విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాతబస్తీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని గెస్ట్ లెక్చలర్లు ఎమ్మెల్యే సుజనా చౌదరికి ధన్యవాదములు తెలియజేశారు. 2023-24 సంవత్సరం నుండి పనిచేస్తున్న అధ్యాపకులను 2025 వరకు రెన్యువల్ చేయవలసిందిగా ఎమ్మెల్యే సుజనా చౌదరిని వారు అభ్యర్థించారు. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో సంబంధిత అధికారులతో మాట్లాడి 2025 విద్యా సంవత్సరం వరకు పొడిగించారు. రెన్యువల్ చేసినందుకు కృతజ్ఞతగా గెస్ట్ ఫ్యాకల్టీ అధ్యాపకుల బృందం ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ను శుక్రవారం కలిసి ధన్యవాదములు తెలియజేశారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …