విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రియల్ ఎస్టేట్ రంగంలో నూతన శకానికి నాంది పలికిన గాయత్రి 99 డెవలపర్స్ సంస్థ నుండి లెమన్ ట్రీ ఎలైట్ బ్రోచర్‌ను సంస్థ ఛైర్మన్ ఎం.అశోక్‌కుమార్, ఎం.డి జి.వెంకటేశ్వరరెడ్డి, మార్కెటింగ్ సీఈఓ.శివరామకృష్ణ చేతులు మీదగా బ్రోచర్ ఆవిష్కరణ జరిగింది. శుక్రవారం, ఆటోనగర్, ది ఆటోమోబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మార్కెటింగ్ సభ్యులు భారీగా తరలివచ్చారు. ఆవిష్కరణ అనంతరం చైర్మన్ యం.అశోక్‌కుమార్ మాట్లాడుతూ పల్నాడు జిల్లా ఐనవోలు, వినుకొండ వై జంక్షన్ దగ్గర ఈ నూతన వెంచర్ రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటిసారిగా అవోకాడో మరియు ఖర్జూరం సాగుతో కూడిన నాలుగు వందల యాబై ఎకరాల భారీ వ్యవసాయ భూములు, క్లబ్ హౌస్‌లు రిసార్ట్స్‌లతో అభివృద్ధి చేసి వినియోగదారుల అందిస్తామని అవోకాడో ఫ్రూట్ గుండెకు, దృష్టికి జీర్ణక్రియ మెరుగుదలకు, క్యాన్సర్ నిరోధానికి ఉపయోగపడుతుందని అందుకే ఈ ఫ్రూట్‌కి దేశీయ మార్కెట్లో అంతర్జాతీయ మార్కెట్లో అవోకాడో ఫ్రూట్ ఆధారిత ఉత్పత్తులకు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉందని అవకాడో చెట్లు, వేరు కాండము మొక్క నాటిన మూడు నుంచి నాలుగు సంవత్సరాల లోపు దిగుబడి ఇస్తుందన్నారు. భవిష్యత్తులో దేశంలో కొత్త మార్కెట్‌కు అవకాశాలు ఉన్నాయని కాబట్టి వినియోగదారులకు మా అవోకాడో ప్లాంటేషన్, ఖర్జూరం తోటలతో కూడిన భూమిని వెంచర్‌గా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జి.వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ 5&11 అవోకాడో ప్లాంటేషన్ ఎకరం ఖర్జూరం తోటతో 150 అతిథి గృహాలు, రెండు ఫంక్షన్ హాల్స్ స్విమ్మింగ్ ఫుల్ రెస్టారెంట్ మొత్తం లేఅవుట్ కు ఏడడుగులు ఎత్తైన ఫెన్సింగ్, సీసీ కెమెరాలు, 10 సంవత్సరాలు ఉచిత సభ్యత్వం, చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్, 40 అడుగులు 30 అడుగులు వెడల్పు మిక్స్ గ్రావెల్ రోడ్లు, నీరు విద్యుత్తు తో పాటు సోలార్ లైటింగ్ తో తక్షణ రిజిస్ట్రేషన్ సౌకర్యంతో వెంచర్ అందిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో గాయత్రి 99 డెవలపర్స్ ఛైర్మన్ ఎం..అశోక్‌కుమార్, ఎం.డి జి. వెంకటేశ్వరరెడ్డి, మార్కెటింగ్ సీఈఓ.శివరామకృష్ణ, మార్కెటింగ్ సభ్యులు, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్
-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …