Breaking News

పవన్ కళ్యాణ్ తో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీ

మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు ఎదుర్కొంటున్న సమస్యలను పవన్ కళ్యాణ్ గారికి వివరించిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్. మంగళగిరిలోని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  క్యాంపు కార్యాలయంలో దాదాపు రెండున్నర గంటల సేపు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు సమావేశమైన సమావేశంలో అధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్  పవన్ కళ్యాణ్ కి కి గ్రామపంచాయతీలు మరియు గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దాదాపు 26 డిమాండ్లను వారి ముందుంచి వాటి గురించి సవివరంగా వివరించి పరిష్కరించాలని కోరడం జరిగింది. ఈ 26 డిమాండ్ల పైన పవన్ కళ్యాణ్  సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తామని హామీనిచ్చినారు.

అందులో భాగంగా..

(1) గ్రామ సచివాలయాలను గ్రామపంచాయతీలలో విలీనం చేసి సర్పంచుల ఆధ్వర్యంలో అన్ని రకాల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని కోరడం జరిగింది .

(2) కేవలం 3వేల రూపాయలుగా ఉన్న సర్పంచ్, ఎంపీటీసీల గౌరవ వేతనాన్ని 15 వేలకు పెంచాలని 6 వేల రూపాయలుగా ఉన్న ఎంపీపీ, జడ్పిటిసి ల గౌరవ వేతనాన్ని 30 వేలకు పెంచాలని కోరడం జరిగింది.

(3) మైనర్ గ్రామపంచాయతీలకు విద్యుత్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.

(4) క్లాప్ మిత్రలకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలే జీతాలు చెల్లించాలని కోరడమైనది.

(5) సర్పంచులు, ఎంపీటీసీలు ,జడ్పిటిసిలు వారి కుటుంబాలతో తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళితే సంవత్సరంలో ఒకసారి ప్రోటోకాల్ దర్శనం ఇప్పించగలరని విజ్ఞప్తి చేయడమైనది.

ఇవే కాకుండా 26 డిమాండ్లను వారికి వివరించడం జరిగింది.

-డిమాండ్లను వివరించిన అనంతరం ఇటీవల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ద్వారా 4500 కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి పనులకు విడుదల చేసినందుకు రాజేంద్రప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

-అనంతరం వీటికి సమాధానంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మీరు పెట్టిన ఈ డిమాండ్ల సాధ్యాసాధ్యులపై అధికారులతో చర్చించి వాటి పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి అవసరమైతే క్యాబినెట్లో చర్చించి పరిష్కరించడానికి కృషి చేస్తానని,ఆ విషయాలను మరొకసారి సమావేశమై మీకు వివరిస్తానని, ఇప్పటినుండి ప్రతినెల మీతో సమావేశమై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడం జరిగింది.

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ ,ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వానపల్లి ముత్యాలరావు, తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ గౌరవ అధ్యక్షులు పి నరేంద్ర, పంచాయతీ రాజ్ కమిషనర్ కృష్ణ తేజ మరియు అన్ని జిల్లాల నుండి జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర కమిటీ నాయకులు 118 మంది పాల్గొనడం జరిగింది.

Check Also

రాష్ట్రంలో 6 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల ఫీజిబులిటీ స్టడీ కోసం రూ. 2.27 కోట్ల నిధులు విడుదల చేయనున్నాం : మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

-కుప్పం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, తుని – అన్నవరం, తాడేపల్లి గూడెం, ఒంగోలులో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధికి ప్రతిపాదనలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *