Breaking News

ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధ్వర్యంలో అవగాహాన కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం కొవ్వూరు  సుందర సాయి కల్యాణ మండపం నందు ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధ్వర్యంలో అవగాహాన కార్యక్రమం నిర్వహించారు.. ,క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అదనపు ఎస్పీ , అస్మ ఫర్హీన్ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు అత్యాచార నిరోధక చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 450 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అస్మ ఫర్హీన్ ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న నేరాలు గురించి వాటి నుండి చట్టరీత్యా వారికి ఎలా రక్షణ లభిస్తుందో వివరాలు తెలుసుకోవడం కోసం ఈ అవగాహన సదస్సులు నిర్వహించడం యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలియపరిచినారు. అలాగే రావులపాలెం, అమలాపురం లో ఎస్సీ ఎస్టీ లపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు తెలియ చేశారు. SC & ST కేసులలో అరెస్టులు జరిగినప్పటికీ ట్రయల్ సమయంలో సాక్ష్యం సరిగా చెప్పకపోవడం వల్ల కేసులలో శిక్షలు పడటం లేదని బాధితులు, సాక్షులు కోర్టుకు వచ్చి సాక్ష్యం సరిగ్గా చెప్పాలని తెలియజేశారు. సాంఘిక సంక్షేమ అధికారి జయ రాజు స్వాతంత్ర్యానికి ముందు మరియు స్వాతంత్ర్యం తర్వాత SC & ST చట్టం గురించి వివరించారు. Rtd. సీనియర్ పిపి గోపాల్ రావు , ఎస్సీ ఎస్టీ చట్టం గురించి మరియు స్వాతంత్రం తర్వాత ప్రభుత్వo సమాజంలో అంటరానితనం నిర్మూలన పై , ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స గురించి అలాగే అట్రాసిటీ యాక్ట్ గురించి చట్ట పరిధిలో జరిగే నేరాలు గురించి, చట్టం ఇంప్లిమెంటేషన్ గురించి స్పెషల్ కోర్టు గురించి పూర్తిగా వివరించి అవగాహన కల్పించడం జరిగింది. బాదితులు కుల ధృవీకరణ పత్రం తీసుకునే విధానం మరియు సదస్సుకు వచ్చినవారు అడిగిన ప్రశ్నలకు సరైనా సమాధానం చెప్పి అవగాహన కల్పించడం జరిగింది. అదనపు జిల్లా న్యాయ మూర్తి కే. భీష్మ గంగేయుడు ఎస్సీ ఎస్టీ కేసులలో బాధితులకు వివిధ రకాల నేరాలలో లభించే పరిహారాలు గురించి వివరించినారు.
కొవ్వూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్సీ ఎస్టీ చట్టం గురించి మరియు చట్ట పరిధిలో జరిగే నేరాలు గురించి వివరించారు. పోలీసు ఇన్స్పెక్టర్ కె సాల్మన్ రాజ్
ఉండవని అలాగే రాజ్యాంగం లోని ఆర్టికల్ 17 గురించి వివరించారు. తదనంతరం ఆన్లైన్ లో ఎగ్జామ్స్ పెట్టి అందులో అత్యధిక మార్కులు వచ్చిన వారికి మెమొంటోలు ఎడిషన్ ఎస్పి సిఐడి రాజమహేంద్రవరం వారు బహుకరించడం జరిగింది. అవగాహన సదస్సు అనంతరం ఈ సదస్సులో ప్రసంగించిన వక్తలు అందరిని ఎడిషన్ ఎస్పి సిఐడి రాజమహేంద్రవరం వారు సాలువాలుతో అలంకరించి సన్మానించారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *