గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ ఉద్యోగులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని పోస్టల్ డిపార్ట్మెంట్, సోలార్ విధ్యుత్ పై అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ కోరారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో జిఎంసి ఉద్యోగులకు పోస్టల్, పిఎం సూర్య ఘర్ లో సోలార్ విద్యుత్ తదితర అంశాలపై ఆయా విభాగాల అధికారులతో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పోస్టల్ డిపార్ట్మెంట్ ఇన్సూరెన్స్, పొదుపుల కోసం మెరుగైన పధకాలను అందుబాటులోకి తెచ్చిందని, అలాగే పిఎం సూర్య ఘర్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ద్వారా సోలార్ విద్యుత్ ని వివిధ కంపెనీల ద్వారా అతి తక్కువ డాక్యుమెంటేషన్ తో అందిస్తున్నారని ఆసక్తి ఉన్న జిఎంసి ఉద్యోగులు ఆయా స్కీం లను పరిశీలించి, అనుకూలమైన వాటిని తీసుకోవాలని సూచించారు. అనంతరం పోస్టల్ స్కీమ్స్ ని పోస్టల్ అసిస్టెంట్ షాహెదా, సోలార్ విద్యుత్ పై సిపిడిసిఎల్ ఈఈ శ్రీనివాసరావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిఎంసి ఉద్యోగులకు వివరించారు.
Prajavartha Online Telugu News