-రాష్ట్రాన్ని యూనిట్ గ తీసుకొని ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తమిళనాడు, తెలంగాణ, పంజాబ్, హర్యానా, రాష్ట్రాలలో చేసిన విధంగా రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకొని ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మంగళగిరి లోని ఐబీఎన్ భవన్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు, లీగల్ సెల్ కన్వీనర్, చిలువూరు నాగరాజు మాదిగ మాట్లాడుతూ కాలయాపన చేయకుండా ఉద్యోగ ఉపాధ్యాయ రాజకీయ రంగాల్లో ఎస్సీ అభివృద్ధి చెందాలంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా జిల్లా యూనిట్ వల్ల నష్టం జరుగుతుందని తక్షణమే విరమించు కోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక సభ్యులు కొమ్మూరి గరటయ్య మాదిగ మాట్లాడుతూ 30 ఏళ్ల పాటు ఎన్నో ఆందోళనలో పోరాటాలు చేసిన ఫలితంగా సుప్రీంకోర్టు ముందుకు వచ్చి ఎస్సీ వర్గీకరణ చేయడం మంచిదని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని చెప్పటం అభినందనీయమన్నారు. ఎస్సీ వర్గీకరణలో ఏ బి సి డి లు విభజించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందేందుకు జిల్లా యూనిట్ గా చేయటం సరైన విధానం కాదని దీనివల్ల నష్టం జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచించి రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని చేయాలని ఆయన కోరారు. ఈనెల 16వ తేదీన విజయవాడలో జరిగే ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం లో ఏబిసిడి వర్గీకరణ పై పూర్తి స్థాయిలో చర్చించి ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం అమలు కల్పించి మాదిగ , మాదిగ ఉప కులాలతో పాటు ఎస్సిల్లోని అన్ని ఉప కులాలకు సత్వరమే న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ న్యాయవాది చిలువూరు నాగరాజు మాదిగ చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ నేతృత్వంలో జరిగే రాష్ట్ర స్థాయి సమావేశానికి వేలాది గా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఈపూరి ఆదాం మాదిగ ఎమ్మార్పీ రాష్ట్ర నాయకులు కట్టేపోగు బాబురావు మాదిగ, పులి దాస్ మాదిగల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్య క్రమంలో రాష్ట్ర నాయకులు ఏటుకూరి విజయ్ కుమార్ మాదిగ, గుంటూరు జిల్లా ఇన్చార్జి కొమరాల శ్రీనివాస రావు మాదిగ, జిల్లా నాయకులు భూషణం మాదిగ,(ఎమ్మెల్యే) నవీన్ మాదిగ , పులి ప్రభుదాస్ మాదిగ, కుక్కమల్ల శేఖర్ మాదిగ ,తదితరులు పాల్గొన్నారు.