బాలల హక్కుల మానవ హక్కుల నేత టీవీ 

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వీధి బాలల,  ఆపదలో ఉన్న బాలల రక్షణ సంరక్షణ కొరకు, బాలల హక్కుల పరిరక్షణ కొరకు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కొరకు అలుపెరుగని పోరాటం చేశారు టీవీ  అని ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ జిల్లా కోఆర్డినేటర్ అరవ రమేష్ అన్నారు. మంగళవారం  విజయవాడ నగర ప్రథమ మేయర్ మరియు ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ వ్యవస్థాపక అధ్యక్షులు పైన టి వెంకటేశ్వరరావు గారి 108 వా జయంతి కార్యక్రమం హనుమాన్ పేటలో గల శ్రీ టీవీ భవన్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అరవ రమేష్ మాట్లాడుతూ శ్రీ టీవీ గారి మార్గం అందరికీ ఆదర్శ అన్నారు. అలాగే టీవీ కుమారులైన టి రమేష్ టి సురేష్  తండ్రి ఆశయాల సాధనకై కృషి చేస్తున్నారు అని అన్నారు.
ఇందులో భాగంగా వివిధ సేవా కార్యక్రమాలు వారి కుటుంబం ద్వారా ప్రతి సంవత్సరం తప్పకుండా నిర్వహించడం గర్వించే విషయమని తెలిపారు.
విజయవాడలోని వివిధ ఆశ్రమాలలో ఆశ్రయం పొందుతున్న బాలబాలికలకు మరియు వృద్ధుల ఆశ్రమాలకు క్రమం తప్పకుండా భోజనం మరియు ఇతర సదుపాయాలు అందిస్తూ ఉన్నారని అందుకు వారికి కృతజ్ఞతలు అని తెలిపారు.
ప్రజా గాయకులు ఆర్ పిచ్చయ్య మాట్లాడుతూ టీవీ సేవలను కొనియాడారు.
వారు మాట్లాడుతూ టీవీ  విజయవాడ నగర పాలక సంస్థ ద్వారా నగర ప్రజలకు అనేక సేవలు అందించారని నగర అభివృద్ధికి విశేషమైన కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాయకులు ఆర్ బిచ్చయ్య,, బర్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ సెక్రెటరీ కె ప్రకాష్ కుమార్ గారు,నవజీవన్ బాల భవన్ కౌన్సిలింగ్ కోఆర్డినేటర్ ప్రసన్నకుమారి, మస్తాన్ గారు,
కృపా ఫౌండేషన్ అధినేత రవీంద్ర, నగరపాలక సంస్థ విశ్రాంత ఉద్యోగి మోహన్ కుమార్ మరియు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సిబ్బంది బాలలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలలకు స్వీట్లు, పండ్లుమరియు భోజనం అందించడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *