విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కంకిపాడు మండలం గొడవర్రు గ్రామంలోని ఇళ్ల లేఅవుట్ ను బుధవారం విజయవాడ సబ్ కలెక్టరు జి. సూర్యసాయిప్రవీణ్ చంద్ సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గొడవర్రు గ్రామంలో 82.89 ఎకరాల్లో ఏర్పాటు చేసిన లేఅవుట్లో 4820 మంది లబ్ధిదారులకు ఇళ్లస్థలాలు అందించడం జరిగిందన్నారు. ఈమేరకు వారు గృహాలను నిర్మించుకునేందుకు వీలుగా ఇళ్ల లేఅవుట్ లెవెలింగ్ పనులను యుద్ధ ప్రాతిపదిక పై పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా కాలనీల్లో రోడ్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఈసందర్భంగా ఇళ్ల నిర్మాణాల తీరును పరిశీలించి లబ్దిదారులతో ఆయన మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణం విషయంలో పూర్తి సహకారాన్ని అందించడం జరుగుతుందన్నారు. విజయవాడ డివిజన్ లో గృహనిర్మాణశాఖ ప్రతిపాదించిన ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అన్ని లేఅవుట్ల అభివృద్ధిని అప్రోచ్ రోడ్డులతో సహా వారంరోజుల్లోగా పూర్తి చేయాలని ఇప్పటికే సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయడంలో సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. వీరివెంట తహశీల్దారు తోట సతీష్ కుమార్, గృహనిర్మాణశాఖాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
కరుణానిధి స్ఫూరితోనే బీసీల *మనుగడ, తమిళనాడు తరహా అభివృద్ధి
-బీఎస్పీ ఏపీ స్టేట్ కోఆర్డినేటర్, రిటైర్డ్ డీజీపీ డా జుజ్జవరపు పూర్ణచంద్రరావు -“సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలికి ఎన్ఠీఆర్ మనవడు …