విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో టిడ్కో క్రింద నిర్మిస్తున్న ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల లోన్ ఖాతాలను త్వరితగతిన ప్రారంభించేందుకు బ్యాంకర్లు పూర్తి సహకారాన్ని అందించాలని జిల్లా కలెక్టరు జె. నివాస్ అన్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి బ్యాంకర్లు, మున్సిపల్ కమిషనర్లు, అర్బన్ తహశీల్దార్లతో బుధవారం నిర్వహించిన సమావేశంలో లోన్ ఖాతాలు తెరవడం, బ్యాంకురుణం మంజూరు తదితర అంశాలపై కలెక్టరు జె. నివాస్ సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో టిడ్కో క్రింద 26 వేల 894 ఇళ్లను నిర్మించడం జరుగుతుందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం పేదలకోసం చేపట్టిన పట్టణ గృహనిర్మాణాలకు సంబంధించిన (టిథ్కో) లబ్దిదారులతో లోన్ ఖాతాలు తెరిచే విషయంలో బ్యాంకర్లు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఈ విషయంపై ఆయా బ్యాంకు అధికారులు సంబంధిత మేనేజర్లకు ప్రత్యేక సర్క్యులర్‌ను పంపాలని కలెక్టరు సూచించారు. రోజుకు కనీసం 5 నుంచి 10 లోన్ ఖాతాలను తెరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. మెప్మా పరిధిలో 8 మున్సిపాల్టీల్లో 13 వేల 957 ఇళ్లకు గాను ఇంతవరకూ 6700 మంది లబ్ధిదారులతో బ్యాంకు రుణఖాతాలు ప్రారంభించారన్నారు. మరో 5797 మంది ఖాతాలకు సంబంధించి రుణంకోసం డాక్యుమెంట్స్ సమర్పించడం జరిగిందన్నారు. టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు రుణమంజూరులో ముఖ్యంగా యస్ ఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరాబ్యాంకు ఎక్కువ లక్ష్యం ఉందని వాటిని అధిగమించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. టిడ్కో ఇళ్లకు సంబంధించి వివిధ అంశాలు సత్వర పరిష్కారానికి సంబంధిత బ్యాంకర్లు అధికారులతో కూడిన వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టరు ఆదేశించారు. టిడ్కోకు సంబంధించిన స్థల విషయంలో ఉన్న 12 కోర్టు కేసుల పరిష్కారానికి సంబంధిత ఆర్ డిఓలు, తహశీల్దార్లతో సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వియంసి కమిషనరు వి.ప్రసన్న వెంకటేష్, హౌసింగ్ జాయింట్ కలెక్టరు శ్రీనివాస్ నుపూర్ అజయ్ కుమార్, విజయవాడ సబ్ కలెక్టరు జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్, టిడ్కో పిడి చిన్నోడు, ఆర్ డివోలు ఖాజావలి, శ్రీనుకుమార్, మెప్మా పిడి డా. ప్రకాశరావు, అడిషినల్ కమిషనరు జె. అరుణ, యల్ డియం ఆర్.
రామ్మోహనరావు, వివిధ మున్సిపాల్టీల కమిషనర్లు, బ్యాంకు అధికారులు, తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు
-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …