విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాసవ్య మహిళా మండలి ఆద్వర్యంలో ప్రపంచ మధుమేహ దినం సందర్భంగా మంగళవారం ఆటోనగర్ నందుగల గురువారం, నాలుగవ క్రాస్, ఆరో రోడ్డు నందు వద్ద వైద్య శిభిరాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రాజెక్ట్ మేనేజర్ కె.శ్రీనివాస రావు మాట్లాడుతూ మధుమేహం పై అవగాహనతో ప్రజా శ్రేయస్సు మొరుగు అవుతుందని అన్నారు. మధుమేహం ప్రధానంగా వంశపారపర్యం, ఊబకాయం, మానసిక ఆందోలన వల్ల సంక్రమిస్తుంది, ఉభయ తెలుగు రాష్ట్రాలు భారతదేశంలో మొదటి స్థానాన్ని కలిగి ఉన్నందున ప్రతిఒక్కరు దీనిపై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలన్నారు. ఆరోగ్య కరమైన కొవ్వు పదార్థాలను తీసుకోవాలని, పరిమితి కి సరిపడా చెక్కర, సమతుల్య ఆహారాన్ని, ఫైబర్ ఉన్న పదార్థాలను తీసుకుంటూ ధూమపానం, మధ్యానికి దూరంగా ఉండాలని ఆయన అన్నారు. 40 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ మధుమేహ పరీక్షలు కోవాలని, ఒకవేల మధుమేహం ఉన్నట్లు నిర్ధారణ అయితే దానికి అనుగుణంగా చికిత్సను తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ శరీరాన్ని చురుకుగా ఉంచాలని అన్నారు. ఎప్పటికప్పుడు బ్లడ్ సుగర్, రక్తపోటు, కొలెస్ట్రాల్ ను పరీక్షించుకోవాలని అన్నారు. ఈ వైద్యశిభిరానికి 87 మంది కార్మికులు సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిబ్బంది యం.అజయ్ బాబు, యస్.కె ఫిరోజ్ బాషా, ఎ.సత్యప్రసాద్, డి. వీరాంజనేయులు, రామ స్మిత పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
సంచార జాతుల సంక్షేమానికి పెద్దపీట
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సంచార జాతుల సంక్షేమానికి సీఎం …