Breaking News

నేషనల్ అర్బన్ లైవ్లీ హుడ్ మెషిన్ 2.0 కమిటీ సమావేశం

-కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులకు త్వరితగతిన రుణ సదుపాయం కల్పించండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వ సహకారంతో విజయవాడ నగరంలో నిర్వహిస్తున్న నేషనల్ అర్బన్ లైవ్లీ హుడ్ మిషన్ 2.0 పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం ప్రధాన కార్యాలయంలో తమ ఛాంబర్ లో ఎన్ యు ఎల్ ఎం 2.0 కమిటీ మొదటి సమావేశం నిర్వహించారు.

కమిటీ చైర్మన్ అయిన కమిషనర్ ధ్యానచంద్ర ఈ సందర్భంగా మాట్లాడుతూ కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ అయినా కన్స్ట్రక్షన్, ట్రాన్స్పోర్ట్, కేర్, డొమెస్టిక్, వేస్ట్ వర్కర్స్ గ్రూప్ల ఏర్పాటు నిర్వాహణ కొరకు ఏర్పడిన ఈ కమిటీ ద్వారా ప్రజలకు నేషనల్ అర్బన్ లైవ్లి హుడ్ మెషిన్ 2.0 ద్వారా లబ్ది కలిగే చర్యలు త్వరితగతిన మొదలు పెట్టాలని, అధికారులను ఆదేశించారు.

వివిధ శాఖల సహకారంతో ఏర్పడిన కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ కి లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, త్వరితగతిన రుణ సదుపాయం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మెప్మా వారు అర్హులైన వారందరికీ కేంద్ర ప్రభుత్వం వారి సంక్షేమ పథకాల ద్వారా లబ్ది కలిగించాలని, నిరాశ్రయులకు షెల్టర్ హోమ్ లు, పట్టణ జీవన ఉపాధి కేంద్రాలు, లాబర్ చౌకులు, డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు. ఇప్పటివరకు యు సి డి వారు నిర్వహించిన ఫ్యామిలీ సోషియో ఎకనామిక్ ప్రొఫైల్ ఆధారంగా కల్పించాల్సిన రుణ సదుపాయంలో ఎటువంటి జాప్యం నిర్వహించరాదని తెలిపారు.

ఈ సమావేశంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు సి డి ) పి.వెంకటనారాయణ, జాయింట్ డైరెక్టర్ (అమృత్)డాక్టర్ కేబిఎస్ఎన్ లత, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్) కె.ప్రియాంక, అడిషనల్ లేబర్ ఆఫీసర్ బి. కృష్ణకుమార్, ఆర్టీవో కె.వెంకటేశ్వరరావు, ఎసిపి (వెస్ట్) ఎన్వీఎస్కే దుర్గారావు, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఐ సి డి ఎస్) జీ. ఉమాదేవి, ఎస్ ఎం ఎం (మెప్మా) ఆర్. ఆదినారాయణ,NULM కన్సల్టెంట్ డాక్టర్ కృష్ణయ్య, వి ఎం సి (యుసిడి) టెక్నికల్ ఎక్స్పర్ట్స్ డాక్టర్ ఫణి కుమార్, శేఖర్, రవిశంకర్, సుజాత, శ్యామల, సిడిపివోలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *