-డయాబెటిక్ ఫుట్ స్క్రీనింగ్ ప్యాకేజీ విడుదల
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆధునిక చికిత్సలు అందించడంలో అగ్రగామిగా ఉన్న అను హాస్పిటల్ నందు డయాబెటిక్ రివర్సల్ ట్రీట్మెంట్ ద్వారా ఇప్పుడు షుగరు పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయడం సులువని హాస్పిటల్ డైరెక్టర్, ప్రముఖ డయాబెటాలజిస్ట్ డా. కె. శ్రీదేవి అన్నారు. గురువారం నాడు స్థానిక సూర్యారావుపేట లోని అను హాస్పిటల్ నందు జరిగిన విలేఖరుల సమావేశంలో డా. కె. శ్రీదేవి మాట్లాడుతూ షుగరు వ్యాధికి చికిత్స కన్నా అవగాహనా ముఖ్యమని అవగాహన లేక ఎంతోమంది ప్రాణాలమీదకు తెచ్చుకుంటారనీ, చక్కటి డైట్, నడక, విశ్రాంతితో కూడిన జీవనం షుగరు కంట్రోల్ కు ఎంతగానో ఉపయోగపడతాయని, మితిమీరిన ఆహారం, శారీరక శ్రమ లేకపోవటం వల్ల చాలామంది ఉబకాయులుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేసారు.
ఇటువంటి పేషంట్స్ కొరకు సరియైన రివర్సల్ ట్రీట్మెంట్ ను ఇవ్వడం ద్వారా మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చునని అభిప్రాయపడ్డారు. సూర్యారావుపేట అను హాస్పిటల్ నందు, ఎనికేపాడు అను న్యూరో కార్డియాక్ సెంటర్ నందు గాని, అను మై బేబీ నందు గాని రిజిస్ట్రేషన్స్ పొందిన వారికీ మొదటి మూడు రోజులు ఉచిత కన్సల్టేషన్, అన్ని రకాల టెస్టులపై 20% రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ప్రపంచ మధుమేహ వ్యాధి దినోత్సవ సందర్బంగా డయాబెటిక్ ఫుట్ స్క్రీనింగ్ ప్యాకేజి ను రూ. 1499 /- లకు అందజేయనున్నట్లు డా. కె. శ్రీదేవి తెలిపారు. ఈ ప్యాకేజీలో HBA1c, RFT, పాదాల పరీక్షలు, ఎండో క్రైనాలజిస్ట్, ఫిజిషియన్ మరియు డయాబెటాలజిస్ట్ కన్సల్టేషన్ సౌకర్యం లభించునని తెలిపారు. ఈ కార్యక్రమం లో డయాబెటిక్ ఫుట్ స్క్రీనింగ్ ప్యాకేజి కరపత్రాన్ని విడుదల చేసారు. విలేఖరుల సమావేశంలో డా. ఎస్. కిరణ్ కుమార్, డా. రిజ్వాన్, డా. రవికిరణ్, డా. భవాని శంకర్ తదితరులు పాల్గొన్నారు.