విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నవంబర్ 14 వ తేదీన బాలల దినోత్సవం సంధర్బంగా శ్రీ కంచి కామకోటి పీఠం వారి సంప్రదాయ పాఠశాల, విజయవాడ బ్రాంచ్ నందు పలు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. గురువారం గాంధీనగర్, బిఆర్ టిఎస్ రోడ్డు ప్రక్కన, విజయవాడ (శారదా కాలేజీ ప్రక్కన) సంప్రదాయ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా దుర్గా మల్లేశ్వర స్వామివారల దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన కె.ఎస్.రామారావు దంపతులు విచ్చేసి సంస్కృతి సాంప్రదాయాల గురించి, బాలల దినోత్సవం యొక్క ప్రాముఖ్యత గురించి బాలికలకు తెలియచేసారు. ఈ వేడుకలలో విజయవాడ సంప్రదాయ పాఠశాలలో పలు కార్యక్రమాలను నిర్వహించారు. దీనిలో సాంస్కృతిక కళలు, భగవద్గీత, వినోద పరమైన ఆటలు, కంప్యూటరు పరిభాష, పాటలు, వక్తృత్వ పోటీలను పాఠశాల యొక్క ప్రధాన ఉపాధ్యాయురాలైన విష్ణుభట్ల పద్మావతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. బాలల దినోత్సవం సంధర్భంగా జరిగిన ఈ వెడుకలలో గెలుపొందిన విద్యార్దినులకు ముఖ్య అతిధిగా విచ్చేసిన కె.ఎస్.రామారావు దంపతులచే బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, పాఠశాల యొక్క ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News