-బి ఆర్ టి ఎస్ రోడ్డు నందు నిర్వహణ
-టీ – షర్ట్ మెడల్ ఆవిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటంతో పాటు నడకను అలవాటు చేయాలనే ఉద్దేశంతో ఈ నెల 17న విజయవాడ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ‘శ్రీరామ ఫైనాన్స్ విజయవాడ మారథాన్’ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు మణిదీపక్ తెలిపారు. విజయవాడ మారథాన్‌కు సంబంధించి ఎంజి రోడ్డులోని ఓహోటల్ నందు టీ-షర్ట్ , మెడల్ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం జరిగింది.శ్రీరామ్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ కె వి ఆర్ కె.వి.ప్రసాద్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఈ నాగేంద్ర, జనరల్ మేనేజర్ వై.ఆర్.వి.ఎస్.ఫణి కుమార్ ఆవిష్కరించారు. అనంతరం శ్రీరామ్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ. గత ఎనిమిది సంవత్సరాలుగా విజయవాడ మారథాన్ కు తాము స్పాన్సర్లు గా వుండటం ఆనందంగా ఉందని అన్నారు. విజయవాడలో ఇటువంటి కార్యక్రమం జరగడం అందులో తము పాల్గొనడం మంచి పరిణామం అన్నారు.ముఖ్యంగా యువత అందరూ ఈ మారథాన్ నందు పాల్గొనాలని తెలిపారు. విజయవాడ మారథాన్ ఛైర్మన్ మణి దీపక్ మాట్లాడుతూ ఇప్పటివరకు విజయవంతంగా 8 మారథాన్ నిర్వహించామని తొమ్మిదవ మారథాన్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరి నుండి మంచి స్పందన లభిస్తుందన్నారు. ఇందులో భాగంగా 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 21 కిలో మీటర్ల పరుగు ఉంటందని తెలిపారు. ఇప్పటి మారథాన్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయని ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోనివారు చేయించుకోవచ్చని తెలిపారు. మారథాన్ జింఖానా గ్రౌండ్ వద్ద ప్రారంభమై బి ఆర్ టి సి రోడ్డు నందు జరుగుతుందని అన్నారు.మారథాన్ సందర్భంగా లత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తి వైద్య సేవలు అందిస్తుందని అన్నారు. శ్రీరామ్ ఫైనాన్స్ జనరల్ మేనేజర్ ఈడుపుగంటి నాగేంద్ర, మాట్లాడుతూ విజయవాడ మారథాన్‌కు ఒక ప్రత్యేకత ఉందని ప్రారంభం నుండి తాము స్పాన్సర్‌గా ఉండటం ఆనందంగా ఉందని తెలిపారు. మారథాన్‌లో పాల్గొన్న వారికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్, మెడల్ ఇవ్వనున్నామని అలాగే ప్రతి విభాగంలోనూ విజేతలకు నగదు బహుమతులు ఉంటాయని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్రతి ఒక్కరికీ టీ షర్టు, ఆర్ఎఫ్ఐడి టైమింగ్ చిప్, గుడి, బ్రేక్ ఫాస్ట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. రన్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరికీ మెడల్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల 16వ తేదీ ఉదయం 11 నుండి 4 వరకు స్పాట్ రిజిస్ట్రేషన్ కొరకు 7815 955 123 లేదా 9885 359 330 నెంబర్లును సంప్రదించవచ్చు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఈ నెల 16 వ తేదీన జింఖానా గ్రౌండ్స్ నందు మారథాన్ కిట్ అందచేస్తారని అన్నారు.