Breaking News

నేటి నుండి జాతీయ సహకార వారోత్సవాలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సంవత్సరము సహకార వారోత్సవాలు నవంబర్ 14 నుండి 21 వరకు పండిట్ జవహర్ లాల్ నెహ్రు జయంతి సందర్భంగా సహకార ఉద్యమానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా సహకార ఉద్యమాన్ని విజయవంతంగా కొనసాగించు కార్యాచరణ నిమిత్తం జరుపబడును. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా గురువారం నుండి సహకార వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సహకార అధికారి, కృష్ణా వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ ఏడాది జరగనున్న 71వ అఖిల భారత సహకార ఉత్సవాలు “వికసిత్ భారత నిర్మాణంలో సహకార సంఘాల పాత్ర” అనే నినాదంతో జరుగ నున్నాయి. సహకార వారోత్సవాలలో భాగంగా జిల్లాకు సంబంధించి ఈ నెల 14వ తేదిన జిల్లాలోని అన్ని సహకార సంఘాలలో సహకార జెండా ఆవిష్కరించి, సహకార పతాక వందనం, సహకార ప్రతిజ్ఞ, సహకార గీతం, సహకార గేయం, సహకార నినాదాలతో ప్రారంభించడం జరిగింది.

సహకార వారోత్సవాలలో భాగంగా భారత జాతీయ సహకార యూనియన్, న్యూధిల్లీ వారి మార్గ దర్శకాల ప్రకారం రోజువారీ అంశాలు విభాగ సహకార అధికారి, మచిలీపట్నం మరియు గుడివాడ వారు రోజూవారీ కార్యక్రమాల వివరాలు ఇవ్వడం జరిగింది.

1 14.11.2024 వికసిత్ భారత్ కొరకు సహకార మంత్రిత్వ శాఖ కొత్త కార్యక్రమాల గురించి. జిల్లా సహకార అధికారి వారి కార్యాలయం, మచిలీపట్నం
2 15.11.2024 సహకార సంఘాలలో నూతన ఆవిష్కరణలు, సాంకేతిక మరియు సుపరిపాలన వక్కలగడ్డ ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం.
3 16.11.2024 వ్యవస్తాపకత, ఉపాధికల్పన మరియు నైపుణ్యాభివృద్దిణి పంచండంలో సహకార సంఘాల పాత్ర కానుమోలు ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం.
4 17.11.2024 సహకార సంఘాలు వ్యాపార ప్రాయోజిత సంస్థలుగా రూపాతరం కో-ఆపరేటివ్ ట్రైనింగ్ కాలేజి, విజయవాడ.
5 18.11.2024 సంఘాల మధ్య సహకారాన్ని పెంపొందించడం వల్లూరిపాలెం ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం.
6 19.11.2024 మహిళలు మరియు బలహీన వర్గముల కొరకు సహకార సంఘాలు తమిరిశ ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం.
7 20.11.2024 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో మరియు మెరుగైన ప్రపంచ నిర్మాణంలో సహకార సంఘాల పాత్ర లంకపల్లి ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం.

పై కార్యక్రమాలలో భాగంగా 14వ తేది నుండి 20వ తేది వరకు ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో కంప్యూటరైజేషన్ ప్రాముఖ్యత, షేర్ ధనము డిపాజిట్లు పెంపొందించడం ద్వారా వ్యాపార వృద్ధి, మెంబర్లకు నాన్ క్రెడిట్ వ్యాపారం ద్వారా సేవలు, అనగా జన ఔషధి కేంద్రాలు, పెట్రోల్ బంకులు, ఎరువుల వ్యాపారం, గోల్డ్ లోన్స్, కామన్ సర్వీసు సెంటర్ సేవలు అందించడం, బకాయి వసూలుపై ప్రచారం జరుగుతుంది. అలాగే సంఘాలు వారి యొక్క విజయ గాధలను గత 100 సంవత్సరములలో సాధించిన ప్రగతిని అందరికి తెలియ జేయడం జరుగుతుంది. కావున అఖిల భారత సహకార వారోత్సవాలు విజయవంతం అయ్యేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా సహకార అధికారి వారు సూచించారు. కార్యక్రమాలు జిల్లా సహకార విద్యాధికారి రంగరాజన్, విభాగ సహకార అధికారి వి.వి.ఫణి కుమార్ (మచిలీపట్నం, గుడివాడ), ఉప విభాగ సహకార అధికారులు, సహకార సిబ్బంది అందరి సమక్షంలో నిర్వహించడం జరిగింది అని తెలిపారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *