-తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కు మంత్రి సవిత ఆదేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా సత్యవేడు బీసీ గురుకుల పాఠశాలకు చెందిన 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత ఆరా తీశారు. వైరల్ ఫీవర్ల వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురియ్యారని తెలుసుకున్న మంత్రి…మెరుగైన వైద్యమందించాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, డీఎంఅండ్ హెచ్వో శ్రీధర్, జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారులను ఆదేశించారు. సత్యవేడు బీసీ గురుకుల పాఠశాలకు చెందిన 40 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చేరారన్న విషయం తెలియగానే బీసీ సంక్షేమ శాఖాధికారులతోనూ, డీఎంఅండ్ హెచ్వోతోనూ ఫోన్లో మాట్లాడారు. విద్యార్థులకు ఎందుకు అస్వస్థతకు గురికావాల్సి వచ్చిందని ప్రశ్నించారు. దీనిపై డీఎంఅండ్ హెచ్వో శ్రీధర్ బీసీ సంక్షేమ శాఖాధికారులు వివరణ ఇస్తూ…రెండ్రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. వారందరికీ రక్ష పరీక్ష చేయగా, వైరల్ పీవర్ సోకినట్లు గుర్తించామని తెలిపారు. విద్యార్థులకు వైద్యమందిస్తున్నామ, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని డీఎంఅండ్ హెచ్వో తెలిపారు. ఒక విద్యార్థి ఊపిరితీసుకోవడం ఇబ్బంది పడుతుండడంతో, తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించినట్లు మంత్రికి వెల్లడించారు. దీనిపై మంత్రి సవిత స్పందిస్తూ…విద్యార్థులకు మెరుగైన వైద్యమందించాలని ఆదేశించారు. గురుకుల పాఠశాలలో ఉన్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపైనా ఆరా తీస్తూ…వా అవసరమైతే గురుకుల పాఠశాలలో వైద్య శిబిరం నిర్వహించి, వారికి కూడా రక్త పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ తో మంత్రి ఫోన్లో మాట్లాడారు. చికిత్స పొందుతున్న విద్యార్థికి మెరుగైన వైద్యమందించాలని ఆదేశించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకోవాలన్నారు. రోజూ ఎఎన్ఎంలతో విద్యార్థుల ఆరోగ్యానికి పరీక్షించాలన్నారు. మరిగించి చల్లార్చిన నీటిని, తాజా ఆహార పదార్థాలను మాత్రమే అందజేయాలని బీసీ సంక్షేమ శాఖాధికారులను మంత్రి సవిత ఫోన్లో ఆదేశించారు.