-సింగిరికోన లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్
నారాయణవనం, నేటి పత్రిక ప్రజావార్త :
నారాయణవనం మండలంలోని పాలమంగళం బీసి కాలనిలో నూతనంగా ఉపాధి హామీ పథకం గ్రాంట్ ద్వారా పూర్తయిన సీసీ రోడ్ల నిర్మాణాలను పరిశీలించి, మిగిలిన రోడ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.
గురువారం సాయంత్రం మండలంలోని పాలమంగళం బీసీ కాలనీలోనే నూతనంగా నిర్మిస్తున్నటు వంటి సిసి రోడ్లను పరిశీలించారు. ఉపాధి హామీ పథకం గ్రాంట్ ద్వారా కొన్ని రోడ్డు నిర్మాణం పూర్తయినాయని, మిగిలినవి త్వరితగతన పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగానే నారాయణ మండలంలోని సింగిరికోన లక్ష్మి నరసింహ స్వామి వారి రోడ్డు నిర్మాణ పరిశీలనలో భాగంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు జిల్లా కలెక్టర్ కు స్వాగతం పలికి స్వామి వారి దర్శన భాగ్యం కల్పించారు అనంతరం కలెక్టర్ కు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Prajavartha Online Telugu News