-పందలపర్రు, జీడిగుంట రిచ్ పాయింట్స్ తనిఖీ చేసిన కలెక్టర్ ప్రశాంతి
-డిసిల్టెషన్ పాయింట్స్ వద్ద మెట్రిక్ టన్ను ఇసుక ఖర్చు రూ.229 లు కలెక్టర్
-టన్ను ఇసుక ధర పందలపర్రు రూ.104.42 , జీడిగుంట రూ.81.32 లు – ఆర్డీవో రాణి సుస్మిత
నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
ఇసుక ర్యాంపు వద్ద లోడింగ్ చార్జీల విషయంలో మార్గదర్శకాల ప్రకారం వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం పందలపర్రు, జీడిగుంట రిచ్ పాయింట్స్ తనిఖీ చేసిన కలెక్టర్ అక్కడి వినియోగదారులు, రవాణా చేసే వాహనాదారులతో సంభాషించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఉచిత ఇసుక సరఫరా విధానం లో అధిక మొత్తంలో ఖర్చులు వసూళ్లు పై, ఆటంకాలు కల్పించడం పై ఫిర్యాదులు విస్తున్నాయని పేర్కొన్నారు. వినియోగదారులు, లారీ డ్రైవర్లు ఇచ్చిన ఫిర్యాదుల , సామాజిక మాధ్యమాల్లో కథనాలు నేపధ్యంలో క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు రావడం జరిగిందన్నారు. రికార్డు నిర్వహణా సామర్ధ్యం మరింత సమర్థవంతంగా నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా అక్కడి లాగ్ బుక్, ఇతర రికార్డులను పరిశీలించడం జరిగింది. రీచ్ పాయింట్స్ వద్ద విధుల్లో ఉండే అధికారులు, సిబ్బంది ఇసుక సరఫరా విధానం లో అత్యంత పారదర్శకత తో వ్యవహరించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న డి సిల్టేషన్ పాయింట్స్ వద్ద టన్ను ఇసుక ఖర్చు కింద రూ.229 మేర నిర్ణయించడం జరిగిందన్నారు. పందలపర్రు రూ.104.42 లు , జీడిగుంట రూ.81.32 లు గా ఓపెన్ రిచ్ వద్ద టన్ను ఇసుకకు ధర నిర్ణయించామని పేర్కొన్నారు. కలెక్టరు వెంట ఆర్డీవో రాణి సుస్మిత, తహసిల్దార్ బి. నాగరాజు నాయక్ తదితరులు ఉన్నారు.