రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ గంధం సునీత మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే. ప్రకాష బాబు లు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లోని పోలీసు అధికార్లతో , రాజమహేంద్రవరం పరిధిలోని పబ్లిక్ ప్రాసిక్యూటర్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమావేశమయ్యారు.
ఈ సమావేశం లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత మాట్లాడుతూ డిసెంబర్ 14వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ నందు అధిక మొత్తంలో సివిల్ కేసులు, రాజీయోగ్యమైన క్రిమినల్ కేసులు, మోటారు వాహనాల యాక్సిడెంట్, చెక్ బౌన్స్ కేసులు, రాజీ పడదగిన అన్ని ఇతర కేసులను గుర్తించి వాటిని అధిక సంఖ్యలో పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. ఈ మేరకు పెండింగ్ లో ఉన్న అన్ని కేసులను గుర్తించి ఆ జాబితాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందజేయాలన్నారు.
ఈ సమావేశాలలో తూర్పు గోదావరి జిల్లా అదనపు ఎస్.పి. ఏ.వి.సుబ్బరాజు , కాకినాడ జిల్లా అధనపు ఎస్.పి. ఎమ్.జె.వి. భాస్కర్ రావు , రామచంద్రాపురం సబ్ డివిజనాల్ పోలీసు ఆఫీసర్ బి.రామ కృష్ణ , రాజమహేంద్రవరం పరిధిలోని పబ్లిక్ ప్రాసిక్యూటర్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ,ట్రాఫిక్ పోలీసు అధికార్లు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News