Breaking News

ఈ నెల నవంబర్ 30 నాటికి జిల్లాలో 3 ఉచిత ఇసుక డీసిల్టేషన్ పాయింట్లు అందుబాటులోకి రానున్నాయి

-ఈ నెల 19 నుండి ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవ క్యాంపెయిన్: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల నవంబర్ 30 నాటికి జిల్లాలో 3 ఉచిత ఇసుక డీసిల్టేషన్ పాయింట్లు అందుబాటులోకి రానున్నాయని, ఈ నెల 19 నుండి ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవ క్యాంపెయిన్ నిర్వహణ ద్వారా ప్రజల్లో మరుగు దొడ్ల వినియోగంపై విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు.

నేటి శుక్రవారం మధ్యాహ్నం ఉచిత ఇసుక విధానం అమలులో భాగంగా పెండింగ్ ఇసుక రీచ్ లు, డీ సిల్టేషన్ పాయింట్ల అందుబాటుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ విధానంలో రాష్ట్ర ముఖ్య కార్యదర్శి గనులు, భూ గర్భ శాఖ ముఖేష్ కుమార్ మీనా, కమిషనర్ ప్రవీణ్ కుమార్ సంబంధిత అధికారులతో కలిసి విజయవాడ నుండి సమీక్ష నిర్వహించగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఎస్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గనుల శాఖ ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు పక్కాగా అమలు కావాలని, ప్రజలకు అందుబాటులో ఉచిత ఇసుక ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ జిల్లాలోని మూడు డీసిల్టేషన్ పాయింట్లలో పాలచ్చురు అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్, పుల్లూరు గ్రామం, పెళ్లకూరు మండలం, స్వర్ణముఖి బ్యారేజి, గూడలి గ్రామం, కోట మండలం నందు వెరసి 1.37 లక్షల టన్నుల ఇసుక లభ్యం ఉన్నదని తెలిపారు. ఈ నెల 30 నాటికి ఈ ఇసుక డీసిల్టేషన్ పాయింట్లు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

అనంతరం ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయితీ రాజ్ శశి భూషణ్ కలెక్టర్లతో మాట్లాడుతూ ఈ నెల 19 నవంబర్ న ప్రపంచ మరుగు దొడ్ల దినోత్సవం (వరల్డ్ టాయిలెట్ డే) పురస్కరించుకుని హమారా సౌచాలయ.. హమారా సమ్మాన్ క్యాంపెయిన్ ప్రారంభించి డిసెంబర్ 10 వరకు వివిధ కార్యక్రమాల నిర్వహణ చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. డిసెంబర్ 10న మానవ హక్కుల దినోత్సవం నాటికి ఈ క్యాంపెయిన్ పూర్తి అవుతుందని, ఈ క్యాంపెయిన్ ద్వారా ప్రజల్లో మరుగుదొడ్ల సౌకర్యం వినియోగించుకోవడం పై, స్వచ్చత, పరిశుభ్రత పై అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశ్యం అని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారి బాలాజీ నాయక్, జిల్లా పంచాయితీ అధికారిణి సుశీల దేవి, ఎస్ఈ ఆర్ డబ్ల్యూఎస్ విజయ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *