-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాలలో 6వ తరగతి, 11వ తరగతులలో ప్రవేశము కొరకు మరియు 7, 8 తరగతులలో మిగిలిన సీట్ల భర్తీకొరకు దరఖాస్తులు స్వీకరణకు తేది పొడిగింపు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి , ఐ.ఎ.ఎస్.సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నడుపబడుచున్న 352 కస్తూర్బా గాంధీ విద్యాలయాలలో 2021 – 22 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి, 11వ తరగతులలో ప్రవేశము కొరకు మరియు7, 8 తరగతులలో మిగిలిన సీట్ల భర్తీ కొరకు, కోవిడ్ -19 వలన నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించుటకు తేదీ 15.07.2021 నుండి తేదీ 20.07.2021 వరకు పొడిగించడమైనది. అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్ ( బడి మానేసిన వారు) పేద ఎస్.సి, ఎస్.టి, బిసి, మైనారిటీ, బి.పి.ఎల్ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కొరకు పరిగణింపబడతాయి. ఈ దరఖాస్తు https://apkgbv.apcfss.in/ సైట్ ద్వారా పొందగలరు. కేజీబీవీలలో పదవతరగతి చదివిన విద్యార్థినులు కూడా పదకొండవ తరగతిలో ప్రవేశం కొరకు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తుచేసు కొనవలెను. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం పంపబడుతుంది. సంబంధిత పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో నేరుగా చూడవచ్చును. ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే నెంబర్లు 9494383617 లేదా 9441270099 సంప్రదించాలని సమగ్ర శిక్షా ఎస్పీడీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.