Breaking News

జిల్లా పర్యటన భాగంగా గుడివాడ విచ్చేసిన జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశిల్…


గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పి సిద్ధార్థ కౌశల్ గురువారం మొదటి సారిగా గుడివాడ సబ్ డివిజన్ లోని డిఎస్పి కార్యాలయాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. అనంతరం గుడివాడ రూరల్, వన్టౌన్, టూటౌన్, సిసిఎస్ సీఐలతో సమావేశం నిర్వహించి వారి నుంచి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం వారితో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతల వారీగా ఎప్పటికప్పుడు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండాలని, కిందిస్థాయి సిబ్బంది నుండి అధికారుల వరకు అందరూ చైన్ ఆఫ్ కమాండ్ కు ప్రాధాన్యత ఇస్తూ, పోలీస్ స్టేషన్ లో నమోదయ్యే ప్రతి రకమైన కేసుల వివరాలను గూర్చి, ఎస్ఐ, సీఐ సబ్ డివిజన్ స్థాయి డిఎస్పీలకు తెలియాలని, ఏదైనా అత్యవసర సమయంలో సమాచారం కోసం నేరుగా హోంగార్డు కానిస్టేబుల్ లతో కూడా ప్రత్యక్షంగా మాట్లాడి, విధినిర్వహణలో వారు ఎదుర్కొనే సమస్యలను వారి అవసరాలను గురించి తెలుసుకుంటాన్నారు. అను నిత్యం ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని, ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత లో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ మహిళల పై జరిగే అకృత్యాల కు సంబంధించి ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఫిర్యాదు ఇవ్వటానికి పోలీస్ స్టేషన్ కు వచ్చే వారితో మర్యాదపూర్వకంగా మెలగాలని తెలిపారు.మా దృష్టికి వచ్చే ప్రతి సమస్యకు తక్షణమే స్పందించి న్యాయం అందించేలా కృషి చేస్తానని, జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క విభాగం గురించి క్షుణ్ణంగా తెలుసుకుని దానికి తగిన విధంగా కార్యకలాపాలు నిర్వహిస్తామని, అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని మీ ప్రాంతంలో జరిగే ప్రతి ఒక్క సమస్య మా దృష్టికి తీసుకురావచ్చునని మీడియా సమావేశంలో తెలియజేసారు. అనంతరం సబ్ డివిజన్ లోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో నమోదయిన కేసుల వివరాలు, దర్యాప్తు, ఇతర వివరాలను గుడివాడ డిఎస్పి సత్యానందంను అడిగి తెలుసుకున్నారు. రికార్డులన్నింటినీ ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని విధుల పట్ల అలసత్వం వహించరాదని తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి ధర్మేంద్ర, గుడివాడ డిఎస్పి సత్యానందం, సబ్ డివిజన్ సిఐలు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

స్వ‌ర్ణాంధ్ర‌-2047.. చారిత్ర‌క ఘ‌ట్టానికి స‌న్న‌ద్ధం

– విజ‌న్ డాక్యుమెంట్ ఆవిష్క‌ర‌ణ‌కు ఇందిరాగాంధీ మునిసిప‌ల్ మైదానంలో ప‌క‌డ్బందీ ఏర్పాట్లు – ఐఏఎస్ అధికారుల సారథ్యంలో ప్ర‌త్యేక బృందాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *