Breaking News

వీధి వ్యాపారులు గుర్తింపు కార్డు కొరకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని వీధి వ్యాపారులు గుర్తింపు కార్డు కొరకు దరఖాస్తు చేసుకొనుటకు సోమవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం మరియు నగర పాలక సంస్థ సర్కిల్ కార్యాలయం నందు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని ప్రతి ఒక్క తోపుడు బండి వీధి వ్యాపారి గుర్తింపు కార్డు పొందుటకు నగర పాలక సంస్థ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలో ట్రాఫిక్ కి అవరోధంగా మరియు మురుగు పారుదలకి అడ్డుగా డ్రైన్ల మీద వీధి వ్యాపారులు చిరు వ్యాపారాలు నిర్వహిస్తూ అడ్డంకిగా ఉన్నారన్నారు. నగరంలోని ప్రతి ప్రధాన రహదారులను దశలవారిగా తొలగించడం జరుగుతుందని తెలిపారు. తొలగించిన ప్రాంతాల్లో స్ట్రీట్ వెండర్లకు జిఎంసి ద్వారా గుర్తింపు కార్డు అందించడానికి ఈ నెల 18 సోమవారం ఉదయం నుండి నగర పాలక సంస్థలోనూ మరియు బృందవాన్ గార్డెన్స్ లోని సర్కిల్ కార్యాలయం నందు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. నగరంలోని నగర పాలక సంస్థ గుర్తింపు కార్డు ఉన్నవారు మరియు లేని వారు విధిగా అందరూ వ్యక్తిగత ఫోటో (వ్యాపారం చేయుచున్న పాస్ పోర్ట్ ఫోటో), కుటుంబ సభ్యుల ఫోటో (14 సంవత్సరాలు మించిన వారు మాత్రమె), డిక్లరేషన్ పత్రం, నివాసపత్ర ఆధారం, గతంలో స్ట్రీట్ వెండర్ గుర్తింపు కార్డు నకలు , నగర పాలక సంస్థ జారీ చేసి గుర్తింపు కార్డు నకలు, ఆధార్ కార్డు, అర్జీదారుని ఫోన్ నెంబర్, బ్యాంకు ఎకౌంటు నకలు తదితర గుర్తింపు పాత్రలతో ప్రత్యేక కౌంటర్ల వద్ద నగర పాలక సంస్థ కౌంటర్ల యందు అందించే ఆర్జీలను పూర్తి చేసి సమర్పించాలన్నారు. ఆర్జీలను స్క్రూటిని చేసి, శాశ్వత గుర్తింపు కార్డులను వీలైనంత త్వరలో మంజూరు చేస్తామని, వీటి ఆధారంతో జోన్ల కేటాయింపు చేపడతామన్నారు.
నగర పాలక సంస్థ స్ట్రీట్ వెండింగ్ జోన్ల డిసెంబర్ 10 నాటికి ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రధాన రోడ్లు మరియు డ్రైన్లను ఆక్రమించకుండా డ్రైన్ వెనుకవైపు వ్యాపారాలు చేసుకొని నగర పాలక సంస్థకు సహకరించాలన్నారు. జోన్లు ఏర్పాటు ఐన తరువాత పూర్తి స్తాయిలో కేటాయించిన రెడ్, గ్రీన్, అంబర్ జోన్లకు తరలి వెళ్లేందుకు సిద్దంగా ఉండాలన్నారు. నగర పాలక సంస్థ అధికారులు మరియు సిబ్బంది ఇబ్బందులకు గిరిచేస్తే నేరుగా తమ సంప్రదించాలన్నారు. కొంతమంది దళారుల ముసుగులో ప్రజాప్రతినిధుల పేర్లను వినియోగిస్తూ నగర పాలక సంస్థ చేపట్టిన కార్యక్రమాన్ని మరియు వీధి వ్యాపారులను భయాందోళనలకు గురిచేస్తున్నారని ఇప్పటికే పిర్యాదులు అందాయని, బాధ్యులైన వారిపై చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *