విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరములో మరియు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్స్, కళ్యాణ మంటపాలు, బొంకేట్ హాల్స్ లో జరుగుచున్న వివాహములు/బర్త్ డే/ఇతర కార్యక్రమములు జరుగు సందర్భములలో సదరు ఫంక్షన్ హాల్స్ పరిసర ప్రాంతములు మరియు వాటికి వెళ్ళు మార్గములలో ట్రాఫ్ఫిక్ అంతరాయములు గుర్తించిన మీదట, వాటిని పరిష్కారము చేయు ఉద్దేశ్యముతో ఎస్. వి. రాజ శేఖర్ బాబు, ఐ.పి.యస్, ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసు కమీషనర్ వారి ఆదేశముల మేరకు ది16-11-2024 వతేదీన పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్ నందు ప్రముఖ ఫంక్షన్ హాల్స్, కళ్యాణ మండపాలు, బొంకేట్ హాల్స్ మరియు ప్రముఖ హోటల్స్ యాజమాన్యము వారిచే సమన్వయ సమావేశము ట్రాఫ్ఫిక్ అధికారులచే నిర్వహించడం జరిగినది. ఈ సమావేశములో ఫంక్షన్ హాల్స్, కళ్యాణ మంటపాలు, బొంకేట్ హాల్స్ నందు కార్యక్రమాల సమాచారము ముందుగా తెలియకపోవుటవలన ట్రాఫిక్ అంతరాయములు ఏర్పడటం , దానివలన సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురికావడం జరుగుతుందని వారికి వివరించి, దానిని వారి సహకారంతో అధిగమించుటకు గాను అస్త్రం యాప్ లో ఒక ఆన్ లైన్ సమాచార దరఖాస్తు పొందుపరచడం జరిగిందని. అస్త్రం యాప్ లో ఫంక్షన్ హాల్స్, కళ్యాణ మంటపాలు, బొంకేట్ హాల్స్ వారి వివరాలతో వాట్స్ యాప్ గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపి, ఆన్ లైన్ దరఖాస్తు నందు 1. కార్యక్రమము తేది 2. కార్యక్రమము ప్రారంభ టైం మరియు ముగించు టైం 3. ఎంతమంది పాల్గొంటారు 4.ఎన్ని కార్లు/బస్సులు/ద్విచక్ర వాహనములు వచ్చే అవకాశము వుంది 5. ప్రముఖ వ్యక్తులు ఎవరు పాల్గొంటున్నారు మెదలైన వివరాలు వాట్స్ యాప్ గ్రూప్ లో ముందుగా ఇచ్చి ట్రాఫ్ఫిక్ పోలీసు వారికి సహకారము అందించి ట్రాఫిక్ అంతరాయములు నివారించుటలో వారి వంతు బాధ్యతగా సహకారము అందించాలని విజ్ఞప్తి చేయుచూ , ప్రస్తుత సమాజంలో ప్రజలు సాంకేతికతంగా నగదు లావాదేవీలు జరుపుతున్న తరుణంలో, అనేక విధములుగా సైబర్ మోసాలకు గురిఅయ్యి కష్టపడి సంపాదించిన నగదు పోగొట్టుకోవడం జరుగుతున్నదని , దానిని నివారించుటకు ప్రజల అవగాహన కొరకు పోలీసు కమీషనర్ రూపొందించిన కొన్ని పాటించివలసిన సలహాలు కుడా వివరించడం , సలహాల ప్రతులు ఫంక్షన్ హాల్స్, కళ్యాణ మంటపాలు, బొంకేట్ హాల్స్ వారికి ఇచ్చి వారి యొక్క ఆవరణలో కుడా సదరు సలహాలు వుంచి సైబర్ మోసాల నుండి కాపాడుకొనుటకు ప్రజలకు అవగాహన కల్పించే విధముగా సహకరించ వలసినదిగా కోరినారు.
ఈ కార్యక్రమములో పోలీస్ కమిషనర్ తో పాటు, లా అండ్ ఆర్డర్ డి.సి.పి. గౌతమి షాలీ, ఐ.పి.యస్., డి.సి.పి. ట్రాఫిక్ కృష్ణమూర్తి నాయుడు, ట్రాఫిక్ అడిషనల్ డి.సి.పి., ఏ.వి.యల్.ప్రసన్న కుమారు, ట్రాఫిక్ ఏ.సి.పిలు, సి.ఐలు, యస్ .ఐ.లు మరియు ఫంక్షన్ హాల్ కళ్యాణ మండపాల, హోటల్స్ ల యజమానులు పాల్గొన్నారు.