-లబ్దిదారుల కేటాయింపు,డీడీల చెల్లింపుల్లో అవకతవలపై ఎమ్మెల్యేల ఫిర్యాదు
-అసెంబ్లీలో టిడ్కో ఇళ్లపై జరిగిన చర్చలో ప్రకటన చేసిన మంత్రి
-మాజీ సీఎం పిచ్చి పనులలో లబ్దిదారులకు తీవ్ర ఇబ్బందులన్న నారాయణ
-టిడ్కో ఇళ్లకు మౌళిక వసతుల కల్పనకు రుణ సమీకరణ ప్రయత్నాలు చేస్తున్నామన్న మంత్రి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ ముఖ్యమంత్రి చేసిన పిచ్చి పనులతో టిడ్కో ఇళ్ల లబ్దిదారులు,కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పురపాలక,పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేసారు.గత ప్రభుత్వ హయాంలో జరిగిన లబ్దిదారుల ఎంపిక,బ్యాంకులకు డీడీల చెల్లింపుల్లో జరిగిన అక్రమాలపై దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు నారాయణ ప్రకటించారు.అసెంబ్లీ సమావేశాల్లో టిడ్కో ఇళ్ల పై జరిగిన స్వల్ప కాలిక చర్చలో మంత్రి నారాయణ ప్రసంగించారు..18 మంది ఎమ్మెల్యేలు వారివారి నియోజకవర్గాల్లో టిడ్కో ఇళ్లలో జరిగిన అక్రమాలు,అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న అవస్ధలను సభ దృష్టికి తీసుకొచ్చారు…ఆ తర్వాత సభలో మాట్లాడిన మంత్రి నారాయణ…అసలు టిడ్కో ఇళ్ల అనుమతుల నుంచి ఏం జరిగిందనేది వివరించారు.
ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన తనకు నిరుపేదల కష్టాలు బాగా తెలుసన్నారు మంత్రి..అందుకే పేదలకు గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఇళ్లు నిర్మాణం కోసం శ్రీకారం చుట్టాం.సీఎం చంద్రబాబు ఆదేశాలతో వివిధ దేశాల్లో పేదల ఇళ్ల నిర్మాణాలు ఎలా జరిగాయో అధ్యయనం చేసాం..దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కేంద్రం నుంచి 7 లక్షల 1481 ఇళ్లకు అనుమతి తీసుకొచ్చాం..కేంద్ర ప్రభుత్వం లక్షా 50 వేలు,రాష్ట్ర ప్రభుత్వం మరో లక్షా 50 వేలు చెల్లించడంతో పాటు మౌళిక వసతుల కల్పనకు ఒక్కొక్క ఇంటికి 90 వేలు ఖర్చు భరించేలా ప్రణాళికలు రూపొందించాం…2014 – 2019 మధ్యలో హై క్వాలిటీ ఇళ్లను టిడ్కో ద్వారా చేపట్టాం.కేంద్రం అనుమతి ఇచ్చిన వాటిలో ముందుగా 5 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టేలా నాటి టీడీపీ ప్రభుత్వంలో పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసాం.ముందుగా 4,54,706 ఇళ్లకు టెండర్లు పిలిచి నిర్మాణాలు ప్రారంభించాం.2019 మే నెల నాటికి 77 వేల 370 ఇళ్లు వంద శాతం పూర్తి చేసాం.గత వైసీపీ ప్రభుత్వం ఎలాంటి కారణాలు లేకుండా మొత్తం ఇళ్లను 2 లక్షల 62 వేల 216 కు తగ్గించేసింది…దేశంలో ఏ రాష్ట్రంలో కూడా షీర్ వాల్ టెక్నాలజీతో ఇళ్లు నిర్మించలేదని….కేంద్రం సూచనలతో ఏడు రాష్ట్రఆల అధికారులు ఏపీకి వచ్చి ఇక్కడ నిర్మాణాలను పరిశీలించినట్లు మంత్రి సభకు తెలిపారు.వీటిలో మొత్తం 38,265 కోట్లతో చేపట్టిన ప్రాజెక్ట్ లో 7500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేలా…ఏపీ ప్రభుత్వం 17,730 కోట్లు నిధులు ఇచ్చేలా డిజైన్ చేసామన్నారు మంత్రి..అయితే
టిడ్కో ఇళ్లకు సంబంధించి 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించేలా కేంద్రం డిజైన్ చేసింది..అయితే కొంతమంది లబ్దిదారులు 360 చ.అడుగులు,మరికొంతమంది 430 చదరపు అడుగులు విస్తీర్ణంలో ఇళ్లు కావాలని కోరినట్లు మంత్రి నారాయణ తెలిపారు..మౌళిక వసతుల కోసం భరించే ఖర్చు 90 వేలు కాకుండా 300 చ.అ.విస్తీర్ణానికి 5.65 లక్షలు,360 చ.అడుగుల విస్తీర్ణానికి 6.65 లక్షలు,430 చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఇళ్లకు 7.65 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేసామన్నారు మంత్రి నారాయణ.అయితే గత ప్రభుత్వం లబ్దిదారులు చెల్లించాల్సిన వాటాలో గందరగోళం చేసి అస్తవ్యస్థంగా మార్చేసిందన్నారు. ప్రతి ఇంటి కిచెన్ లో బ్లాక్ గ్రానైట్ స్టోన్,స్టెయిన్ లెస్ స్టీల్ సింక్,అటకలు ఏర్పాటుచేసాం,కప్ బోర్డు లు ఏర్పాటు,ఏ గ్రేడ్ వర్టిఫైల్ టైల్స్ వేసినట్లు మంత్రి చెప్పారు..గేటెడ్ తరహాలో కమ్యూనిటీ హాల్షా ,పింగ్ కాంప్లెక్స్ ,స్కూల్ కూడా డిజైన్ చేసాం,అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్,అప్రోచ్ రోడ్డు,ప్రతి దగ్గర పార్కు,తాగునీరు,సదుపాయాలు కల్పించేలా డిజైన్ చేసాం..కానీ గత ముఖ్యమంత్రి అన్నింటిని పూర్తిగా వదిలేసారు.
గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో లబ్దదిదారులు చాలా ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమన్నారు మంత్రి.నిర్మాణం పూర్తి కాని ఇళ్ల లబ్దిదారులను బ్యాంకులు లోన్ లు చెల్లించాలని అడుగుతున్నారని…వారంతా కట్టలేని పరిస్థితిలో ఉన్నారన్నారు..ఈ విషయంపై బ్యాంకులతో మాట్లాడుతున్నట్లు మంత్రి చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందని…పార్టీ కలర్స్ టిడ్కో ఇళ్లకు వేయాలని కొంతమంది సూచించినప్పటికీ సీఎం చంద్రబాబు ఒప్పుకోలేదన్నారు. గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నట్లు కలర్ లు వేసామన్నారు..అయితే గత ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటి రంగులు మార్చేసారన్నారు..కాంట్రాక్టర్లకు 540 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. కాంట్రాక్టర్ల సమస్యలపై చీఫ్ ఇంజినీర్లతో కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటాం.ప్రస్తుతం టిడ్కో ఇళ్ల కు మౌళిక వసతుల కల్పన కోసం 5200 కోట్లు అవసరం అవుతుందన్నారు. హడ్కో లేదా ఇతర బ్యాంకుల నుంచి రుణం కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు..వీలైనంత త్వరగా టిడ్కో ఇళ్లలో మౌళిక వసతుల కల్పన పూర్తి చేస్తామన్నారు. కొన్ని చోట్ల టీడీపీ ప్రభుత్వంలో ఇళ్లు పొందిన లబ్దిదారులను తొలగించడంతో పాటు కొంతమంది లబ్దిదారులు డీడీలు చెల్లించినప్పటికీ వాటిని బ్యాంకులలో జమ చేయలేదన్నారు. ఈ రెండు అంశాలపై దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు మంత్రి నారాయణ సభలో ప్రకటించారు.