Breaking News

డేగ్లూర్, నాందేడ్ అభివృద్ధి కోసం ఎన్డీఏ అభ్యర్ధులను గెలిపించండి… : పవన్ కళ్యాణ్

డేగ్లూర్, నేటి పత్రిక ప్రజావార్త :
మహారాష్ట్ర చరిత్రలో ఎంతోమంది మహానుభావులు సనాతన ధర్మ పరిరక్షణ కోసం కృషి చేశారు. ఆ మహనీయుల స్ఫూర్తికి కొన్ని విచ్ఛిన్నకర శక్తులు ఆటంకాలు కలిగిస్తున్నాయి. ప్రజలను విభజించి పాలించే అలాంటి పాలకులను తరిమికొట్టాలి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం.. దేశ సమగ్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ ప్రభుత్వానికి యువత, మహిళలు, మహారాష్ట్ర ప్రజలు మద్దతు పలకాలి. మరాఠా గడ్డపై ఛత్రపతి శివాజీ మహరాజ్ స్ఫూర్తిని నిలబెట్టాల’ని జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. శనివారం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా డేగ్లూరు నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థి జితేశ్రావ్ సాహెబ్ అంతాపుర్కార్ కుటుంబ సభ్యులు ఆయనకు హారతులతో స్వాగతం పలికారు. అనంతరం బహిరంగ సభలో జనవాహినిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నేను ఇక్కడికి కేవలం ఓట్లు అడగడానికి రాలేదు. ఎందరో మహనీయులు పుట్టిన నేల.. ఎందరో సాధువులు నడిచిన నేల.. మహానుభావులు ఉన్న నేల మీద గౌరవం తెలపడానికి వచ్చాను అన్నారు. 2028 లోపు మహారాష్ట్రను రూ. లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే క్రమంలో ఎన్నో గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. భారత దేశాన్ని ఐదు లక్షల ట్రిలియన్ల జీడీపీతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా మార్చడంలో మహారాష్ట్ర కీలకపాత్ర పోషించబోతోంది. ఇలాంటి సమయంలో డేగూర్ నియోజకర్గ అభివృద్ధి చాలా కీలకం. ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. డేగ్లూర్ లో ప్రభుత్వ విశ్రాంతి గృహం, డేగ్లూర్, బిలోమీల్లో పోలీస్ స్టేషన్లు, కోర్టుల నిర్మాణం, హేమంత్ పంత్ ఆలయ అభివృద్ధి, కుందల్ వాడీ బేవలీ రోడ్డు మార్గం నిర్మాణాలను పూర్తి చేసింది. హర్ ఘర్ జల్ యోజన కింద 50 శాతం పనులు పూర్తయ్యాయి. డేగ్లూర్ నియోజకవర్గంలో ఇదే వేగంతో అభివృద్ధి కొనసాగాలంటే, మహారాష్ట్రను లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంతో ముందుకు వెళ్తున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోవాలి. మీ కలలన్నీ సాకారం కావాలి అంటే ఎన్డీఏకు డేగ్లూర్ యువత, ఆడబిడ్డలు ప్రజల మద్దతు కావాలని కోరారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఐదు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం 175 స్థానాలకు 164 స్థానాలు గెలిచి అద్భుత విజయం సాధించింది. గెలిచిన వెంటనే పింఛన్లు రూ. 4 వేలకు పెంచింది. మెగా డీఎస్సీ ప్రకటించింది. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గ్రామాల్లో అభివృద్ధికి బాటలు వేశారు. రూ.4,500 కోట్ల ఉపాధి హామీ నిధులతో గ్రామాల్లో రహదారులు నిర్మిస్తున్నారు. ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టుకుంటుంటే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్ని గాలికొదిలేసిందని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, బీజేపీ జాతీయ కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, నాందేడ్ పార్లమెంటు, డేగ్లూర్ అసెంబ్లీల బరిలో ఉన్న అభ్యర్థులు, నాందేడ్ జిల్లా మహాయుతి నాయకులు పాల్గొన్నారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *