గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వాస్తవంగా వీధి వ్యాపారం చేసుకునే వారికి అండగా ఉంటామని, వారికి త్వరలోనే స్ట్రీట్ వెండింగ్ జోన్ల ఏర్పాటు చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. ఆదివారం కమిషనర్ అమరావతి రోడ్ లో పలు ప్రాంతాల్లో వీధి వ్యాపారులను అనుగుణంగా స్ట్రీట్ వెండింగ్ జోన్ల ఏర్పాటుకు పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులతో కలిసి పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో క్షేత్ర స్థాయిలో వాస్తవంగా వీధి వ్యాపారం చేసుకునే వారికి అండగా ఉంటామని, వారికి వెండింగ్ జోన్ల ఏర్పాటు వేగంగా చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వీధి వ్యాపారాల పేరుతో రోడ్లు, డ్రైన్లు ఆక్రమణ చేస్తూ ప్రజలకు అసౌకర్యం కల్గించడానికి వీలు లేదన్నారు. అమరావతి రోడ్ లో వెండింగ్ జోన్ల ఏర్పాటుకు గుర్తించిన ప్రాంతాలను పట్టణ ప్రణాళిక అధికారులు సర్వే చేసి, ఆయా ప్రాంతాల్లో ఎన్ని బండ్లు ఏర్పాటు చేయవచ్చు, పార్కింగ్ లను పరిశీలించి సోమవారానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అమరావతి రోడ్ లోని మేజర్ అవుట్ ఫాల్ డ్రైన్ పై ప్రతి 5 అడుగులకు ఒక మ్యాన్ హోల్ ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం వీధి వ్యాపారులతో కమిషనర్ గారు మాట్లాడుతూ త్వరలో ఏర్పాటు చేయనున్న వెండింగ్ జోన్ లో స్థల కేటాయింపు చేస్తామన్నారు. రోడ్ల మీద, డ్రైన్ల మీద అడ్డుగా వ్యాపారులు బండ్లు ఉంటే స్వచ్చందంగా తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు.
పర్యటనలో కార్పొరేటర్ ఎన్.బాలాజీ, ఈఈ కోటేశ్వరరావు, ఏసిపి రెహ్మాన్, డిఈఈ రమేష్ బాబు, ఏఎంహెచ్ఓ ఆనందకుమార్, ఎస్ఎస్ సోమ శేఖర్, ఏఈ చైతన్య, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్, వెండింగ్ అసోసియేషన్ నాయకులు నరసింహారావు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్
-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …