-21కె., 10కె, 5కె రన్ లో పాల్గొన్న యువత
-1800 మందికి పైగా పాల్గొన్నారు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ రన్నర్ అధ్వర్యంలో ఆదివారం నగరంలో జరిగిన విజయవాడ మారథాన్ ఉత్సాహభరితంగా జరిగింది. మారథాన్ లో భాగంగా ఉదయం 5గంటలకే నగరంలోని యువత, పెద్ద వారు అందరూ మారథాన్ లో పాల్గొనేందుకు జింఖానా గ్రౌండ్స్ కు చేరుకున్నారు. ఉదయం 5గంటలకు మారథాన్ కు జి . ఎస్.టి అండ్ కస్టమ్స్ కమిషనర్ ఎస్ . నరసింహా రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరంలో ప్రతి సమాత్సరం మారథాన్ నిర్వహించడం పట్ల నిర్వాహకులను అభినందించారు. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంతో పాటు , నడక అలవాటు చేయాలనే ఉద్దేశంతో ఈ మారథాన్ నిర్వహించారని. అన్నారు. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నడక, వాకింగ్ చేయడం వలన ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఈ సందర్భంగా మారథాన్ లో పల్గొన్నవారికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామ్ ఫైనాన్స్ జనరల్ మేనేజర్ వై . ఆర్ . ఇ . ఫణి కుమార్ మాట్లాడుతూ విజయవాడ మారథాన్ లో ప్రతి ఏటా పాల్గొనేవారు సంఖ్య పెరుగుతుందని అన్నారు. నగర వాసులకు నడక, ఆరోగ్యం పై అవగాహన కోసం ఈ మారథాన్ గత ఎనిమిది సార్లు నిర్వహించారన్నారు. ఇపుడు నిర్వహించిన ఈ. మారథాన్ లో నగరవాసులు అన్నీ వర్గాల వారు పాల్గొన్నారని అన్నారు. అలాగే మారథాన్ కు తమ పూర్తి సహకారం అందించామని, భవిష్యత్తులో కూడా సహకరిస్తామని అన్నారు. ఆప్ కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్. ఎస్.రెడ్డి మాట్లాడుతూ విజయవాడ మారథాన్ లో పెద్ద సంఖ్యలో నగర వాసులు పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. విజయవాడ నుండే కాకుండా హైదరాబాద్, బెంగుళూర్, చెన్నై నుండి కూడా పాల్గొన్నారని, ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తు లో కూడా పెద్ద ఎత్తున జరగాలని, అలాగే యువత కూడా పాల్గొనాలని అన్నారు. మారథాన్ ఆర్గనైజర్ మని దీపక్ మాట్లాడుతూ 1800 మంది పాల్గొన్నారని అన్నారు. విజయవాడ మారథాన్ కు ప్రత్యేకత ఉందన్నారు. ఈ మారథాన్ లో కలశాల యువత, విద్యార్థులు, నగర వాసులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారని అన్నారు. 21 కిలో మీటర్ల నడక, 10కె, 5కె నడక పోటీలు గత ఏడాది కన్న పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని అన్నారు. మూడు కేటగిరీలలో విజేతలకు రు .75 వెలు నగదు బహుమతులు అందజేసినట్లు తెలిపారు. వరుసగా తొమ్మిదవ సారి నిర్వహించిన ఈ మారథాన్ కు శ్రీరామ్ ఫైనాన్స్ సహకరిస్తుందని అన్నారు. మారథాన్ లో పాల్గొన్న వారికి లత సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ వైద్య సేవలను అందించిందని అన్నారు. మారథాన్ లో పాల్గొన్న వారందరికీ డిజిటల్ సర్టిఫికెట్ అందిస్తామని అన్నారు. ఇది అన్ని మారథాన్ లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. మారథాన్ నిర్వహణలో నాగేశ్వర రావు, పార్డు పలువురు సహకరించారని. మారథాన్ విజయవంతంగా జరగడానికి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు.