Breaking News

అయ్యప్ప పడిపూజ & భజన పోస్టరు ఆవిష్కరన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మొగల్రాజపురం లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు నివాసం వద్ద అధివారం బొండా ఉమామహేశ్వరావు చేతుల మీదుగా ఆపదలను తీర్చే దైవం హరిహర సుతుడు అయ్యప్ప పడిపూజ & భజన ఆహ్వానం 24-11-2024 సాయింత్రం 6:00, మన MLA బొండా ఉమా మహేశ్వరరావు స్వగృహమునందు, మొగల్ రాజపురం నందు జరగబోయే భజన కార్యక్రమం ఆహ్వాన పోస్టర్ను ఆవిష్కరించడం జరిగినది.

ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ  బ్రహ్మశ్రీ మురళీధరన్ నంబూద్రి గురుస్వామి చే కేరళ సంప్రదాయంలో పడిపూజ కార్యక్రమము అంగరంగ వైభవముగా నిర్వహించనున్నామని, పవిత్ర భక్తికి ప్రతీక, అయ్యప్ప దీక్ష క్రమశిక్షణ, నిస్వార్థం, ఆధ్యాత్మిక ఎదుగుదలకు అంకితభావానికి ఈ దీక్షా నిదర్శనం అని… అయ్యప్ప స్వామి వారి దివ్యాశీస్సులతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ కూడా సకల సంపదలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ,  ఈ పడిపూజ కార్యక్రమానికి అయ్యప్పలు మరియు దీక్ష పరులు శివ స్వాములు, భవానీలు, భక్తులుయావన్మంది విచ్చేసి స్వామి వారి తీర్థ ప్రసాదములు స్వీకరించి, అయ్యప్ప కృపకు పాత్రులు కావాలని బొండా ఉమా కోరారు. అయ్యప్ప స్వామి పడిపూజ పోస్టర్ ను ఆవిష్కరించిన వారిలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ స్వామి, తదితర శివ స్వాములు, భవాని లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *