-10 రోజుల్లో ధాన్యం కొనుగోలు సొమ్ము చెల్లింపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ రూరల్ మండలం రాయనపాడు గ్రామ సచివాలయాన్ని గురువారం జాయింట్ కలెక్టర్ డా.కె. మాధవిలత ఆకస్మిక తనిఖీ చేశారు. గురువారం ఈ సందర్భంగా ఇ-క్రాప్ బుకింగ్, కోవిడ్ ఫీవర్ సర్వే తదితర అంశాలకు సంబంధించిన విషయాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. సచివాలయానికి వచ్చే సర్వీసులను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ప్రభుత్వ పథకాల పోస్టర్లను లబ్ధిదారుల జాబితాలను ఆమె పరిశీలించారు. వైఎస్ఆర్ బీమా, కాపు నేస్తం వంటి పథకాలకు సంబంధించి సోషల్ అడిట్ నిర్వహించారని అడిగారు. నో మాస్క్- నో ఎంట్రీ బ్యానర్ అందరికి కనబడేలా ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు జాప్యం లేకుండా ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించి సచివాలయ సిబ్బంది ప్రజల విశ్వాసాన్ని చూరగొనలన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ తమ ధాన్యంకు సొమ్ము చెల్లింపులు త్వరితగతిన జరిగేటట్లు చూడాలని కోరారు. దీనిపై జెసి మాధవిలత స్పందిస్తూ 10 రోజులోగా ధాన్యం తాలుకా సొమ్ము చెల్లింపులు జరుగుతాయని చెప్పారు. వీరి వెంట తహాశీల్దార్ శ్రీనివాస నాయక్ గ్రామ పెద్దలు పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.