గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్పీసిఐ సర్వే, జియో ట్యాగింగ్ పర్యవేక్షణ లోపంపై 12 మంది నోడల్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వార్డ్ సచివాలయ కార్యదర్శుల ద్వారా జరుగుతున్న నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పిసిఐ) సర్వే, ఇళ్ల జియో ట్యాగింగ్ వేగవంతంపై మౌఖికంగాను, టెలి కాన్ఫరెన్స్ ద్వారాను ఆదేశించినా ఆశించిన స్థాయిలో ఆయా నోడల్ అధికారుల పరిధిలో సర్వే వేగవంతం కాలేదన్నారు. ఎన్పిసిఐ సర్వేకి సంబందించి బి.భవ్యసాయి, సిహేచ్.నాగేశ్వరరావు, హేచ్.వెంకటేశ్వర్లు, కె.సుబ్బారావు, పి.వెంకట్రావు, ఆర్.నాగవేణి, ఎస్కె.నసీర్ అహమ్మద్ లకు, హౌసింగ్ జియో ట్యాగ్ కి సంబందించి కె. నాగరాజు, సిహేచ్. నాగేశ్వరరావు, ఎన్.ఆనంద కుమార్, ఎన్.అనిల్ కుమార్, ఆర్.నాగవేణిలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని తెలిపారు.
Tags guntur
Check Also
సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఎన్డీయే విధానం
-నాకు అధికారం, సీఎం కుర్చీ కొత్తకాదు… ప్రజలు నమ్మకంతో గెలిపించారు -వాట్సాప్ ద్వారా త్వరలో 150 సేవలు అందుబాటులోకి -వాట్సాప్ …