రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ పాఠశాలల్లో అందచేసే మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయటం నిర్వహణా లో శుభ్రత పాటించడానికి ప్రాధాన్యతా ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. మంగళవారం స్థానిక బొమ్మూరు జెడ్పీ హై స్కూల్ ను ఆకస్మికంగా సందర్శించి, మధ్యాహ్న భోజన పథకాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విద్యార్థులతో ముఖాముఖి సంభాషించడం జరిగింది. మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందచేస్తున్న వాటి వివరాలు తెలుసుకున్నారు. ఆరుబయట విద్యార్దులు భోజనాన్ని తీసుకొవడం పై వివరాలు తెలుసుకుని, పరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్దులు భోజనాన్ని అందచెయ్యలన్నారు. కూర్చుని ఆహారం తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. 10 వ తరగతి విద్యార్థులకు అందచేసే బోధన సంబంధ అంశాలను ప్రస్తావించడం జరిగింది. వంట సాల, పిల్లలు ఆహారం తీసుకొనే ప్రాంతాలలో శానిటేషన్ నిర్వహణ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. వేడి వేడిగా ఆహార పదార్థాలను పిల్లలకి వడ్డించాలని తెలియ చేశారు. కలెక్టరు వెంట జిల్లా పాఠశాల విద్యాధికారి కే. వాసుదేవరావు, తదితరులు పాల్గొన్నారు.
Tags rajamandri
Check Also
పెన్షన్ దారులకు వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం – రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
-రెండు నెలపాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోయిన మూడో నెలలో ఒకేసారి మొత్తం చెల్లింపు -పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని మరణించిన …