విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆడ పశువుల్లో గర్భస్రావానికి, మగ పశువుల్లో కీళ్ల వాపులు, వంధ్యత్వానికి కారణమయ్యే బ్రూసెల్లోసిస్ వ్యాధి నియంత్రణకు డిసెంబర్ 15 వరకు బ్రూసెల్లోసిస్ టీకా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా.. పశు సంవర్థక శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. పశువుల నుంచి మనుషులకు సోకే గుణం కూడా ఈ వ్యాధికి ఉందని.. పశు వ్యాధుల నియంత్రణ కార్యక్రమం ద్వారా 4 – 8 నెలల వయసు ఆడ దూడలకు టీకా వేయడం జరుగుతుందని పశు సంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.హనుమంతరావు వివరించారు. ఒకసారి టీకా వేస్తే జీవితంలో మరెప్పుడూ వ్యాధి రాదని పేర్కొన్నారు. పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డివిజనల్ డిప్యూటీ డైరెక్టర్ డా. గోపీచంద్, సీడీవో వెంకటేశ్వరరావు, డా. మనోజ్, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్
-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …